తెలుగు ఇండస్ట్రీలోకి ఏం మాయ చేశావే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మళియాళ భామ సమంత అతి తక్కువ కాలంలో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది.  ఈ అమ్మడు ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లు దాటింది.  ఇప్పటికీ గ్లామర్ మెయింటేన్ చేస్తూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉంది.  ఏం మాయ చేశావే సహనటుడు నాగ చైతన్యనను రీయల్ లైఫ్ లో కూడా ప్రేమించి పెళ్లి చేసుకోబోతుంది.  ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోవడంతో నిశ్చితార్థం కూడా జరిగింది.  

నాగచైతన్య ఇటీవలే అక్టోబర్ లో మా పెళ్లి అని స్పష్టం చేశారు.  కాగా అక్కినేని కుటుంబానికి కోడలు కాబోతున్న సమంత ఈ మద్య చాలా సాంప్రదాయంగా ఉంటూ కనిపిస్తుంది.  కాకపోతే ఈ అమ్మడు గత కొన్ని రోజుల నుంచి కాస్త గ్లామర్ కి పనిపెట్టినట్లు అనిపిస్తుంది. రీసెంట్ గా ఓ కవర్ ఫోటో లో హాట్ హాట్ గా దర్శనమిస్తూ కనిపించింది.  తాజాగా మరో వివాదానికి తెరలేపింది సమంత.  వేసవి విడిది కోసం విదేశాలకు వెళ్ళింది సమంత , అయితే అక్కడ బీచ్ లో వేసుకునే బికినీ అంటూ బికినీ ఫోటోలను తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ఇంకేముంది పెద్ద లొల్లి మొదలయ్యింది .
Image result for samantha
పెళ్లి ముహూర్తం చూసుకొని పెళ్లి పీటల మీదకు ఎక్కబోతున్న ఈ భామ కాస్త ఎక్స్ పోజింగ్ తగ్గిస్తుందేమో అని అనుకుంటున్న సమయంలో ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫోటో లకు ఫోజు ఇవ్వడం , ఇలా బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రచ్చ రచ్చ మొదలయ్యింది.  తెలుగు, తమిళంలో కొన్ని సినిమాలు చేస్తుంది సమంత..ఈ సమయంలో ఇలా బికినీ లొల్లి మొదలు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు .  చక్కగా పెళ్లి మూహూర్తం దగ్గర పడుతుంది..పెళ్లి పీటలు ఎక్కే ఈ సమయంలో ఇలాంటి ఫోటోలు షేర్ చేయడం ఏంటీ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  దీనిపై సమంత రియాక్టు అయ్యింది..వారికి ట్విట్టర్ లో సమాధానం ఇచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: