తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోల వారుసుల హవా నడుస్తుంది. ఇప్పటికే మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోలు వచ్చారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలు నాగ చైతన్య, అఖిల్.  తాజాగా   నాగ చైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దం’ పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  ఈ సంవత్సరం ‘ప్రేమమ్’ చిత్రంతో మంచి విజయం అందుకున్న చైతూకి ఈ చిత్రం మంచి బూస్టింగ్ ఇచ్చింది.  గత పది సంవత్సరాల నుంచి పెద్ద హిట్స్ ఏమీ లేని నాగచైతన్య ప్రేమమ్ తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.  

Image result for rarandoi veduka chuddam stills

‘రారండోయ్ వేడుక చూద్దం’ మంచి కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కింది. నాగ చైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం' చిత్రం మంచి కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది.ఈ చిత్రం విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ కలెక్షన్స్ ని వసూలు చేసినా కూడా ఇప్పుడు ,మంచి కలెక్షన్స్ ని వసూలు చేస్తూ ముందుకు సాగుతుంది.

Image result for rarandoi veduka chuddam stills
ఈ ఎమోషనల్ చిత్ర౦ ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడం తో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ని వసూలు చేసే భాట లో నడుస్తుంది.ఈ చిత్రం ఇప్పటివరకు నాలుగు రోజులలో రూ.10.39 కోట్లను వసూలు చేసింది.ఈ మూవీ లో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. 


ఏరియా వైజ్ కలెక్షన్లు :


నైజాం         3.70 కోట్లు


సీడెడ్         1.45 కోట్లు


ఉత్తరాంధ్ర      1.56 కోట్లు


ఈస్ట్           0.89 కోట్లు


వెస్ట్            0.67 కోట్లు


కృష్ణ           0.88 కోట్లు


గుంటూరు      0.94 కోట్లు


నెల్లూరు        0.30 కోట్లు


ఏపీ & టీఎస్   10.39 కోట్లు 

మరింత సమాచారం తెలుసుకోండి: