తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించి, దర్శకత్వం వహించిన దర్శక రత్న దాసరి నారాయణ రావు తీవ్ర అస్వస్థతో నిమ్స్ లో చేరారు.  గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  గడిచిన అయిదు నెలల్లో దాసరి నారాయణ రావుకు రెండుసార్లు చికిత్స జరిగింది. తొలిసారి జనవరి 19న ఆసుపత్రిలో చేరారు. అప్పుడు చికిత్స అనంతరం మార్చి 29వ తేదీన ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆయనకు అప్పుడు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ చేశారు.
5 నెలల్లో రెండుసార్లు..
ఆయనకు ఇన్‌ఫెక్షన్ సోకిందని, దీంతో ఆందోళనకర పరిస్థితి ఉందని సమాచారం. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అధిక రక్తపోటుతో ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన తన 75వ పుట్టిన రోజును జరుపుకున్నారు. అంతలోనే వారం క్రితం మరోసారి పరిస్థితి బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు.
Image result
ప్రస్తుతం ఆసుప‌త్రిలో డ‌యాల‌సిస్ అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న‌ పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు తెలిసింది.ఆయ‌న ఆసుప‌త్రిలో ఉన్నార‌న్న విష‌యం ఈ రోజే మీడియాకు తెలిసింది. ఈ రోజు సాయంత్రం దాస‌రి ఆరోగ్యంపై బులిటెన్ విడుద‌ల చేయ‌నున్నట్లు తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: