భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న వ్యక్తి.  పేదరికం నుంచి ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఉన్నత శిఖరాలు అందుకున్న రాజకీయ వేత్త నరేంద్ర మోడీ.  అంతే కాదు ఆయన మహిళలంటే ఎంతో గౌరవించే వ్యక్తి..అలాంటి మోడీ ముందు నిర్లజ్జగా వ్యవహరిస్తూ పిక్కలు కనిపించేలా బట్టలు వేసుకోవడమే కాకుండా కాలుపై కాలు వేసుకొని అవమానించింది ఓ నటి.  ఇంతకీ ఆ నటి ఎవరా అనుకుంటున్నారా..! బాలీవుడ్ హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా.  
Image result for priyanka chopra pm modi
ప్రధాని నరేంద్ర మోడీని మంగళవారం బెర్లిన్‌లో ప్రియాంక చోప్రా కలిసింది. అయితే ఆమె వేసుకున్న దుస్తులు, కూర్చున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.  ‘బేవాచ్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ప్రియాంక చోప్రా బెర్లిన్ వెళ్లింది. ఇదే సమయంలో విదేశీ పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ సోమవారం బెర్లిన్‌కు చేరుకున్నారు. ప్రధాని రాక గురించి తెలుసుకున్న ప్రియాంక.. ఆయనను కలిసింది. ఆరు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాలలో పర్యటించనున్నారు.
Image result for ప్రియాంక చోప్రా
సోమవారం బెర్లిన్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయా దేశాధినేతలో సమావేశమై వాణిజ్య సంబంధాలపై చర్చించనున్నారు. అదేవిధంగా దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు.  ప్రియాంక చోప్రా   కాళ్లు కనిపించేలా డ్రెస్సు వేసుక వేసుకోవడమే కాకుండా దేశ ప్రధాని ముందు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.  ప్రియాంకా ప్రధానిని అవ‌మానించింద‌ని కొంద‌రు నెటిజన్లు అభిప్రాయ‌ప‌డ్డారు.  అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఎదురుగా ఎలా కూర్చోవాలో ఓ భారతీయ స్త్రీకి తెలియదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Image result for priyanka chopra pm modi
మరోవైపు తనకు ఈ విషయం ఏమాత్రం పట్టనట్టు.. బెర్లిన్ లోని ఓ హోటల్ లో ప్రియాంక తన తల్లి మధుచోప్రాతో కలిసి పొట్టి దుస్తులు వేసుకున్న ఫోటోదిగి మరి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అంతేకాదండోయ్.. 'లెగ్స్ ఫర్ డేస్' అని క్యాఫ్షన్ కూడా పెట్టింది. ఇంకేముందు ఆమె పోస్ట్ కాస్త వివాదంగా మారి ప్రియాంకను తిట్టుడు మొదలు పెట్టారు నెటిజన్లు.  ఆమె  చేసింది ముమ్మాటికి తప్పేనని, ఆమె పొగరు బట్టిన పిల్ల అని, అసలు ఏ దేశానికి నువ్వు ప్రాతినిథ్యం వహిస్తున్నావో మర్చిపోయావా అంటూ పోస్టులు కూడా పెట్టారు.  మొత్తానికి ఈ ముచ్చట మొత్తం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: