బబ్లీ గర్ల్ హన్సిక పెళ్లి కూతురు గా మారబోతుందా? అవును అనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం హన్సిక ను ప్రేమిస్తున్న హీరో శింబు తండ్రి మీడియా తో మాట్లాడిన మాటలే అని అంటున్నారు.  తన  కొడుకు ఎవరిని ఇష్టపడితే వారితో పెళ్లి చేయడానికి తనకు  ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పడ మే కాకుండా తన కుమారుడు  హన్సికను  పెళ్లి చేసుకుంటానన్నా తను  అడ్డు చెప్పనని మీడియా కు  షాక్ ఇచ్చారు. శింభు, హన్సికల మధ్య చాలా రోజులుగా ప్రేమాయణం సాగుతోంది అంటూ  తమిళ మీడియా కోడై కూస్తోంది.

 సినిమా వర్గాలు కూడా ఈ  విషయాన్ని ధృవీకరిస్తున్నాయి,  ఒక నాటి నయన తార ప్రేమికుడు హీరో సింబు హన్సికతో ప్రేమలో దిగాక శింభు నడవడికలో చాలా మార్పులు వచ్చాయట. ఇంతకు ముందులాగా కాకుండా కాస్త పరిణతితో ఆలోచిస్తున్నాడట. అందుకే  హన్సిక తో వివాహం చేయాలని సింబు కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తున్నారట.  ప్రస్తుతం శింభు తన చెల్లెలి పెళ్లి హడావిడిలో ఉన్నాడు.  హన్సిక ఇంట్లో కూడా  ఈ పెళ్ళికి  గ్రీన్ సిగ్నల్ లభించినట్లు  సమాచారం.

 త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరుగుతుందని వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం హన్సిక తమిళంలో పలు సినిమాలతో బిజీగా ఉంది. అవన్నీ పూర్తవ్వగానే పెళ్లి చేసుకుందామని ఈ బబ్లి గర్ల్ భావిస్తోందట. ఈ వార్తలను  బట్టి హీరో సింబు ఒక ఇంటి వాడు అయినట్లే అనుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: