హెడ్ లైన్ చూసి  బొమ్మాళీ  చైనా సినిమాలో న‌టిస్తుంద‌ని    అనుకుంటున్నారేమో ..అలాంటిది ఏమీ లేదు. కానీ చైనా ఫైట్స్ మాత్రం చేస్తోంది. ఒంటి చేత్తో వంద‌మందిని మ‌ట్టి క‌రిపించ‌డం ఎలాగో నేర్చుకుంటోంది.  ఈ విద్యల‌న్ని బాహుబ‌లిలో ప్రద‌ర్శించాడ‌నికేమో అని కూడా మీరు అనుకోవ‌చ్చు. ఎంత మాత్రం కాదు. అనుష్క చైనాలోని యుద్దవిద్యల‌ను నేర్చుకుంటోంది వ‌ర్ణ కోసం.
��
అరుంద‌తి త‌రువాత అనుష్క న‌టించిన ఆ రేంజ్ ఫిల్మ్ వ‌ర్ణ. ఆడువారు మాట‌ల‌కు అర్దాలే వేరులే  , యుగానికి ఒక్కడు సినిమాల ఫేం సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం దాదాపు 70కోట్లతో తెలుగు, త‌మిళ బాష‌ల్లో రూపొందింది. ఈ సినిమాలో అనుష్క ద్విపాత్రిభిన‌యం చేస్తోంది. సాదార‌ణ గృహిణిగా, గ్రామీణ మ‌హిళ‌గా అనుష్క క‌నిపిస్తుంది...త‌మ ప్రాంత ర‌క్షణ కోసం గ్రామీణ మ‌హిళ‌గా వున్న అనుష్క చైనా యుద్ద విద్యలు నేర్చుకోని పోరాటం చేస్తుంద‌ట‌. అరుందతిలో క‌త్తిప‌ట్టి చేసిన వీర‌విన్యాసం కంటే వ‌ర్ణలో అద్బుత‌మైన పెర్పామెన్స్ వుంటుంద‌ని మూవీ యూనిట్ అంటోంది. బ‌లుపు సినిమాను నిర్మించిన పివిపి సంస్ధ ఈ సినిమాను  రెండు బాష‌ల్లో అత్యధిక సెంట‌ర్లలో ఒకేసారి రిలీజ్ చేయ‌బోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: