సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్ గా ఒక్క చాన్స్ దొరికితే జీవితం ధన్యమైతుందనుకునే ఈ రోజుల్లో ‘సూపర్’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలో ఎక్కడలేని ఇమేజ్ సొంతం చేసుకుంది.  ఈ అమ్మడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాలు దాటినా ఇప్పటికీ బిజీ హీరోయిన్ గానే ఉంది.  అయితే అనుష్కలో మరో ప్రత్యేకత ఏంటంటే..ఎంత గొప్ప గ్లామర్ పాత్రల్లో కనిపించినా..అదే సమయంలో అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో లాంటి ప్రయోగాత్మ లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
Image result for anushka visit temple
 తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే అనుష్క ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో దేవసేన గా నటించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.  సాధారణంగా తమ సినిమా హిట్ అయితే దేవుళ్లకు మొక్కుబడులు చెల్లిస్తారు.  ఊహించినదానికంటే భారీ సక్సెస్ వస్తే ఇంకేముంది ఆల్రెడీ మొక్కుకున్న పుణ్య క్షేత్రాలతో పాటు మిగతా వాటిని కూడా సందర్శించేసుకుంటారు కొందరు. ‘బాహుబలి- 2’ ఇచ్చిన భారీ సక్సెస్ తో సంబరంలో ఉన్న అనుష్క  వరుస పెట్టి గుళ్ళు గోపురాలు చుట్టేస్తోంది.
Image result for anushka visit temple
ఈ మధ్యే కొల్లూరులో మూకాంబిక దేవాలయాన్ని సందర్శించిన ఆమె తాజాగా కేరళలో ఉన్న మరో ప్రసిద్ధ దేవాలయాన్ని కూడా దర్శించేసుకుంది. అంతే కాదు ఈ మద్య కొన్ని చోట్ల శాంతి పూజలు కూడా చేయించినట్లు వార్తలు వచ్చాయి.  ఇదంతా అనుష్కకు పెళ్లి బలం కలిసి రావడం లేదని అందుకే పుణ్య క్షేత్రాలు, హోమాలు, శాంతి పూజలు చేయిస్తున్నట్లు కొంత మంది అంటున్నారు.  ఇలా వరుసగా పుణ్య క్షేత్రాలు తిరిగేస్తున్న ఆమె లిస్టులో ఇంకా ఎన్ని దేవాలయాలు, ఎన్ని పుణ్య క్షేత్రాలు ఉన్నాయో మరి. ఇకపోతే ఈమె ప్రస్తుతం అశోక్ డైరెక్ట్ చేస్తున్న ‘భాగమతి’ చిత్రంలో నటిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: