క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘రంగస్థలం’ అన్న టైటిల్ ను ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడ విడుదల చేసారు. ఈ టైటిల్ కు మెగా అభిమానుల నుంచి ఇప్పటికే మిశ్రమ స్పందన వస్తోంది. 

ఈ విషయాలు అన్నీ చిరంజీవి దృష్టికి వచ్చినట్లు ఉన్నాయి. ఈ వ్యవహారం పై చిరంజీవి సుకుమార్ తో తన తీవ్ర అసంతృప్తిని వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ అసంతృప్తిని చిరంజీవి చరణ్ వద్ద కూడ ప్రస్తావించినట్లు టాక్. 

మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఒక మెగా కుటుంబ యంగ్ హీరోకు ఇటువంటి టైటిల్ ఏమిటి అని చిరంజీవి సుకుమార్ వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయమై చిరంజీవి ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకు కనీసం టైటిల్ అయినా మాస్ ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి కదా అని చిరంజీవి సుకుమార్ కు క్లాస్ పీకినట్లు టాక్. 

అంతేకాదు ‘పల్లెటూరి మొనగాడు’ లేదా అలాంటి రేంజ్ లో ఉండే టైటిల్ ను ఎంచుకోవాలి కాని ‘రంగస్థలం’ అన్న క్లాసికల్ టైటిల్ ఈసినిమాకు ఎంత వరకు సరిపోతుంది అన్నది చిరంజీవి అభిప్రాయం అని అంటున్నారు. దీనితో ఈసినిమాకు సంబంధించిన అన్ని కీలక విషయాలలోనూ తన సలహాలు లేకుండా ఫైనల్ ఎనౌన్స్ మెంట్ చేయవద్దని చిరంజీవి అటు సుకుమార్ కు ఇటు చరణ్ కు మెత్తటి క్లాస్ పీకినట్లు టాక్..    



మరింత సమాచారం తెలుసుకోండి: