మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర పై ‘బిగ్ బాస్’ షో చేయబోతున్నాడు అన్న ప్రకటనను చూసి ఆ ఆనందం నుండి జూనియర్ అభిమానులు ఇంకా తేరుకోలేక పోతున్నాడు. దీనికితోడు జూనియర్ తనదైన రీతిలో కన్ను గీటుతూ ఈ షోకు తాను రెడీ అంటూ ఇచ్చిన స్టిల్ ఇప్పటికే మీడియాకు హాట్ ఫోటోగా మారిపోయింది. 

మరో రెండు నెలలలో మొదలు అయ్యే ఈషోకు సంబంధించి షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈషో నిర్వాహకులైన స్టార్ మాటివి యాజమాన్యానికి జూనియర్ ఎన్టీఆర్ విధించిన షరతులు ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి. తన బుల్లితెర ఎంట్రీ చాల రిచ్ గా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో ఈషో షూటింగ్ ను ముంబాయిలోని ఒక ప్రముఖ స్టూడియోలో చిత్రీకరించాలి అన్న కండిషన్ పెట్టి మాటివి యాజమాన్యానికి జూనియర్ షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుగు ప్రేక్షకులకు ఇటువంటి తరహ రియాలిటీ షోలు చూడటం మొట్టమొదటిసారి అయిన నేపధ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి మొదటి ఎపిసోడ్ నుండి భారీ రేటింగ్స్ రాబట్టడానికి జూనియర్ ఈ సలహాను స్టార్ మాటివికి ఇచ్చినట్లు టాక్. ఎత్తుగడ వల్ల అదనపు ఖర్చులు అయినా ‘బిగ్ బాస్’ షోకు తెలుగులో మంచి ఆదరణ గ్యారెంటీతో స్టార్ మాటివి జూనియర్ షరతులు అన్నిటిని అంగీకరించినట్లు తెలుస్తోంది. 

వాస్తవానికి చిరంజీవి నాగార్జునలు నిర్వహించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో షూటింగ్ మొత్తం అన్నపూర్ణ స్టూడియోలోనే జరిగింది. ఐతే ‘బిగ్ బాస్’ షో మొత్తం ముంబయి స్టూడియోల్లోనే షూటింగ్ అంటే కష్టం కాబట్టి  ఇంట్రడక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ముంబాయిలో తీసి ఆ తరువాత ఎపిసోడ్స్ ను హైదరాబాద్ లోని ఏదైనా ఒక భారీ భవనాన్ని అద్దెకు తీసుకుని ఈ షో ఎపిసోడ్స్ షూటింగ్ కొనసాగించాలని మాటివి ఏదోవిధంగా జూనియర్ ను ఒప్పించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: