ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగవ్రాసిన ‘బాహుబలి 2’ విడుదలై 50 రోజులు పూర్తి అయిన సందర్భంగా ఈసినిమా యూనిట్ వర్గాలు విడుదల చేసిన పోస్టర్ పై కొన్ని సెటైర్లు పడుతున్నాయి. దీనికి కారణం ‘బాహుబలి 2’ 1050 సెంటర్లలో 50 రోజులు రన్ పూర్తి చేసుకుంది అన్న విషయాన్ని ఈ పోస్టర్ హైలెట్ చేస్తోంది. 

అయితే ఈ సెంటర్స్ విషయంలో క్లారిటీ లేదు అని కొందరి విమర్శకుల వాదన. ‘బాహుబలి 2’ 17వందల కోట్లకు పైగా వసూలు చేసింది అన్న వార్తలు ఉన్నా ఇప్పటికీ ఈసినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా ‘బాహుబలి 2’ 1050 సెంటర్ల లిస్టు ఏమిటి అన్నది క్లారిటీ ఇవ్వకుండా సెంటర్లకు సంబంధించిన వివరాలు చెప్పకుండా కేవలం ఒక ముద్ద అంకెతో ఈ సెంటర్స్ లిస్టుతో ఈ పోస్టర్ ను విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. 

ఈమధ్య ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్యూ ఇస్తూ రాజమౌళి గతంలో తాను దర్శకత్వం వహించిన ‘మగధీర’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఆ సినిమా 100 రోజులు ప్రదర్శింపబడ్డ ధియేటర్స్ లిస్టులో తనకు నిర్మాత అల్లు అరవింద్ కు భేదాభిప్రాయాలు వచ్చిన నేపధ్యంలో తాను అప్పట్లో ‘మగధీర’ శతదినోత్సవానికి కూడ వెళ్ళని నేపధ్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే అటువంటి రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి 2’ సెంటర్ల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఈ విషయమై రాజమౌళి ఎంత వరకు క్లారిటీ ఇవ్వగాలుగుతాడో చూడాలి.

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి 2’ కలక్షన్స్ హవా పూర్తిగా తగ్గిపోవడం చైనాలో ‘దంగల్’ హడావిడి ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపధ్యంలో ‘బాహుబలి 2’ రికార్డులను ‘దంగల్’ బ్రేక్ చేయడం ఖాయంగా మారబోతోంది. అయితే చైనాలో ‘బాహుబలి 2’ ను కూడ డబ్ చేసి విడుదల చేస్తున్న నేపధ్యంలో ఆసినిమా అక్కడ కనీసం 300 కోట్లు రాబట్ట గలిగ్తే ‘బాహుబలి 2’ 2000 కోట్ల కలక్షన్స్ సినిమాగా రికార్డ్ సృష్టించడం ఖాయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: