కొన్ని సినిమాల టైటిల్స్ జోష్ ని తెస్తే ..మ‌రికొన్ని టైటిల్స్ మెంట‌ల్ ఎక్కిస్తాయి. అయితే టైటిలే మెంట‌ల్ అయితే....ఇక ఏం చెప్పాలో తెలియ‌ని ప‌రిస్ధితిక‌దా..? . అదే సిట్యూయేష‌న్ ఫేస్ చేశాడు కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్.

ప్రస్తుతం స‌ల్లూబాయ్ న‌టిస్తున్న సినిమా పేరు మెంట‌ల్. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన స్టాలిన్ కి ఇది రీమేక్. హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటోంది . అయితే స్టాలిన్ సినిమాకు మెంట‌ల్ కి మ్యాచ్ అవ్వడం లేద‌ని ఆ మ‌ద్య కొద్దిమంది స‌ల్మాన్ తో డైరెక్ట్ గా నే అన్నార‌ట‌. కానీ మెంట‌లే సూప‌ర్ అని కండ‌ల‌వీరుడు అన్నాడ‌ట‌.

అయితే అక్కడి నుండి అస‌లు క‌ధ మొద‌ల‌యిందట‌. షూటింగ్ లో అంద‌రూ మెంట‌ల్ మెంట‌ల్ అంటుంటూ హీరోకి అదోలా అనిపించిందట‌. అంతేకాక త‌న ప్రేయ‌సి లూలియా వెంచ‌ర్ కూడా షూటింగ్ కి రావ‌డం...అక్కడ అంద‌రూ మెంట‌ర్ అని సంభోదించేస‌రికీ నిజంగానే స‌ల్మాన్ కి చిర్రెత్తుకొచ్చింద‌ట‌. వెంట‌నే డైరెక్టర్ ని పిలిచి టైటిల్ చేంజ్ చేయ‌మ‌ని చెప్పాడని ..... దీంతో డైరెక్టర్ మెంట‌ల్ ని కాస్త జ‌య‌హోగా మార్చారని స‌మాచారం.. ఇదండి స‌ల్మాన్ మెంట‌ల్ క‌ధ‌...సారీ మెంట‌ల్ తెప్పించిన క‌ధ‌.

మరింత సమాచారం తెలుసుకోండి: