చివరి నిముషంలో ఖంగారు లేకుండా ‘దువ్వాడ జగన్నాథం’ సెన్సార్ ను ఒక వారం ముందే పూర్తిచేసి రిలీజ్ కు ఏవిధమైన అడ్డంకులు లేకుండా రెడీ పెట్టేసారు ‘దువ్వాడ’ దర్శక నిర్మాతలు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీకి యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

టాప్ హీరోల సినిమాలు అంటే పెద్దపెద్ద ఫైట్స్ రక్తపాతం ఉండటం కామన్ కాబట్టి ఈమూవీకి కూడ యు/ఎ సర్టిఫికేట్ వచ్చింది అంటున్నారు. అక్కడక్కడ సెన్సార్ అభ్యంతరం చెప్పిన కొన్ని డైలాగులకు వినిపించకుండా మ్యూట్ చేస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ ఫస్ట్ ఆఫ్ ఒక గంట 23 నిముషాలు ఉంటుందని సెకండ్ ఆఫ్ ఒక గంట 12 నిముషాలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 

ఈసినిమాలోని ఒక పాటకు బన్నీ అభిమానులు లేచి చిందులు వేస్తారని ఆ పాటలో గ్రాఫిక్స్ అంత బాగున్నాయని సెన్సార్ సభ్యులు కామెంట్స్ చేసినట్లు టాక్. ఈమూవీ పూర్తిగా మాస్ క్లాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు హరీష్ శంకర్ రూపొందించాడని సెన్సార్ సభ్యులు హరీష్ ను అభినందించినట్లు టాక్. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు అన్ని పరిస్థుతులు కలిసి వస్తున్నాయి. ఈసినిమాకు కొద్ది గ్యాప్ తో విడుదల అవుతుంది అనుకున్న మహేష్ ‘స్పైడర్’ దసరా రేస్ కు వెళ్లిపోవడంతో ఈమూవీకి ఎటువంటి పోటీ లేకపోఅవడంతో ఈసినిమాకు డివైడ్ టాక్ వచ్చినా సరైన ఏ సినిమాలు లేని నేపధ్యంలో కనీసం 80 కోట్ల కలక్షన్స్ రావడం ఖాయం అని అంటున్నారు. అదృష్టం ఉండి ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే బన్నీ కెరియర్ లో మొట్టమొదటి 100 కోట్ల సినిమాగా ‘దువ్వాడ’ మారడానికి అన్ని విషయాలు కలిసి వస్తాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: