ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది.  ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ కల్చర్ కాసింత ఎక్కువే అయ్యిందని చెప్పొచ్చు.  బాలీవుడ్ హాట్ బ్యూటీ సోనాలి చౌహాన్ గుర్తుంది కదా.. ఈ అమ్మడు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు చిత్రాల్లో తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించింది.   తాజాగా సోనాల్ చౌహాన్ డేటింగ్ లో ఉన్నట్లు బాలీవుడ్ లో సంచలన కథనాలు వస్తున్నాయి. అయితే ఈ అమ్మడు డేటింగ్ చేస్తుంది ఎవరో తెలిస్తే..మరో షాక్ కి గురౌతారు.  
actress bhagyashree son abhimanyu dassani dating with sonal chauhan
ఒకప్పుడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటించిన ‘మైనే ప్యార్ కియా’ సినిమా తెలియిని వారు ఉండరు.  ఈ చిత్రంలో సల్మాన్ సరసన నటించిన  భాగ్యశ్రీ గుర్తుంది కదా..! ఆ చిత్రం తర్వాత ఎక్కువ సినిమాలు చేయలేదు. అనుకోకుండా కెరీర్ కి  ఫుల్ స్టాప్ పెట్టేసి పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.
Sonal's Growing Friendship With Abhimanyu Dassani
 అసలు విషయానికి వస్తే..సొనాలి చౌహాన్..తో డేటింగ్ చేస్తున్న కుర్రాడు ఎవరో కాదు భాగ్యశ్రీ తనయుడు అభిమన్యు దసాని.  ఈ కుర్రాడు త్వరలో హీరోగా రాబోతున్నాడు..అయితే అప్పుడే తన  సీనియర్ హీరోయిన్ ని బుట్టలో వేసుకున్నాడని బాలీవుడ్ వర్గాల్లో గుస గుస. ప్రస్తుతం భాగ్యశ్రీ తన కొడుకు స్టార్ ఫ్యూచర్ గురించి ఆశలు చాలానే పెట్టుకుంది.  మైనే ప్యార్ కియా తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చినా భాగ్యశ్రీ చేతులారా మిస్ చేసుకుంది.  అలాంటి ఇబ్బందులు తన తనయుడికి రాకుండా చూడాలని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇలాంటి రూమర్స్ తో ఇమేజ్ దెబ్బతింటుందని బాధపడుతుంది. ఎలాగైనా  కొడుకు రూపంలో మళ్ళి బాలీవుడ్ జెండా పాతాలని డిసైడ్ అయ్యింది. మొత్తానికి ఇంకా సినిమాల్లోకి రాకముందే మైనే ప్యార్ కియా అంటున్న కొడుకుని ప్రేమ పావురం భాగ్యశ్రీ ఎలా కంట్రోల్ చేస్తుందో లేదో చూడాలి. 

Here's How They Met


మరింత సమాచారం తెలుసుకోండి: