యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద బిగ్ బాస్ గా కనిపించబోతున్నాడు. స్మాల్ స్క్రీన్ పై తన సందడి షురూ చేసేందుకు యంగ్ టైగర్ సిద్ధమయ్యాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ తో సర్ ప్రైజ్ చేసిన తారక్ ఈరోజు ఆ సినిమా టీజర్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేశాడు. జేమ్స్ బాండ్ తరహాలో ఎన్.టి.ఆర్ లుక్ అదరగొట్టేసింది.   


బిగ్ బాస్ షో కాస్త స్పైసీగా ఉంటుందని తెలిసిందే. హిందిలో సంచలనం గా మారిన ఈ షో తెలుగులో కూడా అది తారక్ హోస్ట్ గా వస్తుందని ఎవరు ఊహించి ఉండరు. ఈ క్రమంలో టీజర్ కూడా ఆ అటెంప్ట్ తో వచ్చేసింది. ఇద్దరు నాజూకైన భామల మధ్య తారక్ సూట్ లో కనిపించాడు. బ్యాక్ గ్రౌండ్ లో జేమ్స్ బాండ్ మ్యూజిక్ తరహాలో మ్యూజిక్ వస్తుంది.  


కచ్చితంగా బుల్లితెర మీద బిగ్ బాస్ ఓ సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. రెండు సీజన్లుగా రానున్న ఈ షో 45 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ రియాలిటీ షో కోసం తారక్ ఏకంగా 7 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. షూటింగ్ మొత్తం ముంబైలోనే చేస్తారని తెలుస్తుంది. సో మొత్తానికి మొన్న ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ చేసిన బిగ్ బాస్ ఈరోజు టీజర్ తో నిజంగానే ప్రోగ్రాం ఎలా ఉండబోతుందో చూపించాడు.

.

మరో పక్క తారక్ బాబి డైరక్షన్ లో చేస్తున్న జై లవకుశ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. నందమూరి కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: