ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ టైం నడుస్తుందని చెప్పొచ్చు. కొద్దికాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న తారక్ టెంపర్ తో మళ్లీ ఫుల్ ఫాంలో వచ్చాడు. పూరి జగన్నాధ్ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ నటించిన ఆ సినిమా ఎన్.టి.ఆర్ నట విశ్వరూపాన్ని చూపించింది. ఇక ఆ తర్వాత సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో కూడా తారక్ ను కొత్తగా ప్రజెంట్ చేసింది. 


ఎప్పుడు మూస ధోరణిలో సినిమాలు చేస్తే ఎలా అని.. అభిమానులు కోరుకునే డిఫరెంట్ సబ్జెక్ట్ లతో అలరిస్తున్నాడు తారక్. ఇక జనతా గ్యారేజ్ తో తారక్ కొట్టిన బాక్సాఫీస్ హిట్ తెలిసిందే. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన ఆ మూవీ తారక్ కెరియర్ లో బెస్ట్ హిట్ అందుకుంది. ఇక లాస్ట్ ఇయర్ నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో ఫ్యాన్స్ కు పండుగ తెచ్చిన తారక్ ఫిల్మ్ ఫేర్ అవార్డును సైతం అందుకున్నాడు.


2017 ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో 2016లో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమాకు గాను ఎన్.టి.ఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకున్నాడు. సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా తారక్ కెరియర్ లోనే డిఫరెంట్ సినిమా అని చెప్పొచ్చు.  నోవాటెల్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. 


బెస్ట్ యాక్టర్ గా నాన్నకు ప్రేమతోతో పాటు జనతా గ్యారేజ్ సినిమా తరపున నామినేషన్ లభించినా ఫైనల్ గా తారక్ బెస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నాడు. 2007లో యమదొంగ సినిమాకు గాను మొదటిసారి ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న జూనియర్ పదేళ్ల తర్వాత మళ్లీ నాన్నకు ప్రేమతో సినిమాతో ఫిల్మ్ ఫేర్ కొట్టేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: