ఈమధ్య కాలంలో అల్లుఅర్జున్ చాల తెలివిగా మాట్లాడటం నేర్చుకోవడంతో ఈ స్టైలిష్ స్టార్ ప్రదర్శిస్తున్న వ్యూహాత్మక తెలివి తేటలకు ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు చాల ఆశ్చర్య పోతున్నాయి. తన సినిమాలకు సంబంధించి కథలను అదేవిధంగా దర్శకులను ఎంతో తెలివిగా ఎంచుకుంటున్న బన్నీ తెలివితేటలను చూసి మెగా కాంపౌండ్ కూడ చాల ఆశ్చర్య పోతోంది అన్న వార్తలు ఇప్పటికే ఉన్నాయి. 

నిన్న జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో 2016 సంవత్సరానికి గానూ ‘ఉత్తమ నటుడు’ విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక కావడంతో నిరుత్సాహపడిన మెగా అభిమానులకు మరి కొద్ది సేపటికే అల్లు అర్జున్ ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆ ఫంక్షన్ కు హాట్ టాపిక్ గా మారిపోయాడు. దీనితో బన్నీ తెలివి తేటలకు మెగా అభిమానులు మురిసిపోతున్నారు. 

నిన్న జరిగిన అవార్డ్స్ ఫంక్షన్ లో ఫిలిం ఫేర్ ప్రత్యేక అవార్డ్ విభాగంలో అవార్డ్ ను అందుకున్న బన్నీ ఆ అవార్డ్ ను అందుకోవడమే కాకుండా ఆ ఫంక్షన్ కు వచ్చిన అతిధులందరిని రెండు నిముషాలపాటు నంచునేలా చేసింది. బన్నీ తన ఉపన్యాసంలో టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావు ఇటీవల కాలం చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ అవార్డును దాసరికి అంకితం చేస్తున్నానని ప్రకటించడంతో ఆడిటోరియంలోని వారంతా నిల్చుని బన్నీకి అభినందనలు తెలియచేసారు.

దీనితో ఈ వేడుక మొత్తంలో దర్శక రత్న దాసరిని దాసరిని తలచుకున్న ఒకే ఒక్క వ్యక్తిగా బన్నీ చాల వ్యూహాత్మకమైన గుర్తింపు పొందాడు. దీనితో ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ లో అల్లు అర్జున్ తన స్పీచ్ లో సెంటిమెంట్ పండించాడు అంటూ నిన్నటి ఫంక్షన్ పై కొందరు సెటైర్లు వేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: