అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డ్స్ లిస్టులో బెస్ట్ యాక్టర్ అవార్డు పొంది రెండు రోజులు గడవకుండానే మరో అవార్డును జూనియర్ సొంతం చేసుకున్నాడు. కళా తపస్వి విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమా పేరిట విశ్వనాథ్ గౌరవార్ధం నటి తులసి ఈ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే. 

తన గురువు విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సందర్భంగా విశ్వనాథ్ ను సత్కరించే ఉద్దేశ్యంతో తులసి ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని చాల భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం రేపు హైదరాబాద్ లో అత్యంత ఘనంగా జరగబోతోంది. ఈ సందర్భంగా ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ కార్యక్రమ వివరాలతో పాటు ఈ అవార్డు గ్రహీతల లిస్టు కూడ ప్రకటించారు.

తెలుగు తమిళ కన్నడ మళయాళ హిందీ సినిమా రంగాలకు చెందిన అనేకమంది ఈకార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ కు తమిళ యంగ్ హీరో ధనుష్ కు టాలీవుడ్ టాప్ యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు వారి నటనకు సంబంధించి ప్రతిభకు గుర్తుగా ఈ ‘శంకరాభరణం’ అవార్డ్స్ తో గౌరవించబోతున్నారు. అదేవిధంగా మళయాళ సినిమా రంగానికి దుల్కర్ సల్మాన్ కు కూడ ‘శంకరాభరణం’ అవార్డ్ ను ప్రకటించారు. 

అందరూ మహిళలే కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్న ఈ ‘శంకరాభరణం’ అవార్డ్స్ కమిటీ నిర్వహిస్తున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్ న్యూస్ ప్రస్తుతం సంచలన న్యూస్ గా మారింది. వచ్చే సంవత్సరం నుండి ఈ అవార్డ్ ఫంక్షన్ ను మరింత ఘనంగా సినిమా రంగానికి చెందిన అనేక విభాగాలకు విస్తరించేలా ఈ అవార్డ్స్ కార్యక్రమం ఉండబోతున్నట్లు నిర్వాహకులు చెపుతున్నారు. వరస పెట్టి వస్తున్న విజయాలతో పాటు జూనియర్ కు వరసపెట్టి వస్తున్న అవార్డ్స్ వార్తలు విని జూనియర్ అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: