పాటలతో కూడా సెగ పుట్టించడమంటే చిరంజీవి కుటుంబాన్నే సినీరంగం తలచుకుంటుంది. అదిరిపోయే పాటలు, డాన్స్ తో చిరంజీవి సినీరంగాన్ని ఉర్రూతలూగించి రాజకీయాల్లోకి వస్థే ఆయన వారసుడికగా కుమారుడు రాంచరణ్ అదే పనిలో పడ్డారు. ఇక సోదరుడు పవణ్ కళ్యాణ్ గూర్చి వేరే చెప్పక్కర్లేదు. కాని వీరికి కూడా పాటలతో సెగపుట్టించే పాప్ సింగర్ ను చూసి వావ్... అనుకుంటున్నారు అందరు.

మెగా హీరోలపై చెలరేగి పాటలు చేసి మెగా అభిమానులతో పాటు, వారిపై ప్రేమతో సినిమాల్లో కూడా పాటల సెగ పుట్టించిన ఆపాప్ సింగర్ తన పేరులో కూడా సెగను నింపుకున్న బాబా సెహగల్. ఇప్పుడందరికి తెలిసిందనకుంటా మెగా హీరోలపై ఆయన పాటల సెగ ఏంటో.చిరంజీవి, పవణ్ కళ్యాణ్ లంటే ఆయనకు అమితమైన అభిమానం, చిరంజీవికోసం పాడిన ‘రూప్ తేరా మస్థానా’, పవణ్ కళ్యాణ్ కోసం పాడిన జల్సా టైటిల్ సాంగ్ లు టాలీవుడ్ లో ఓరేంజిలో సెగపుట్టించినవే.

అయితే బాబా సెహగల్ ఇక సినిమాల్లో కాకుండా సెపరేట్ గా తన పాటలతో చిరు ఫ్యామిలీలో చిందులేపించే పనిలో పడ్డాడు, ఆమద్య పవణ్ కళ్యాణ్ పుట్టిన రోజుకు ప్రత్యేకంగా పాట చేసి ఆయన పుట్టిన రోజును హోరెత్తించిన బాబా సెహగల్, లేటేస్టుగా చిరంజీవిపై కూడా ఓ పాట చేసాడట, అది చిరు జన్మదిన వేడుకలో పాడి హోరెత్తించేందుకు రెడీ అయ్యాడట, ఇక మిగిలింది రాంచరణ్. ఆయన మీద కూడా ఓపాట చేస్థాడేమో, చెర్రీ బర్థ్ డే ను కూడా బాబా తన పాటతో రంజింప చేస్థాడేమో అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: