స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డిజె మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్ టీజర్ రిలీజ్ సమయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన నెగటివ్ పబ్లిసిటీ సినిమా మీద పడకుండా ఆడియో వేడుకలో అల్లు అర్జున్ తన దర్శకుడి హరిష్ శంకర్ చేత పవర్ స్టార్ గురించి అదిరిపోయే స్పీచ్ ఇప్పించాడు.


అయితే ఆడియో చెడగొట్టకుండా ఉండేందుకు బన్ని వేసిన మెగా ప్లాన్ అంటూ కొన్ని విమర్శలు వచ్చాయి.  మరో పక్క సినిమా ప్రమోషన్స్ లో కూడా పవన్ కళ్యాణ్ మీద వారి ఫ్యాన్స్ గురించిన ప్రశ్నలు.. సినిమా సాంగ్ గుడిలో మడిలో గొడవల వ్యవహారం కూడా ఏవి ప్రస్తావించొద్దని ముందే చెప్పేస్తున్నాడట అల్లు అర్జున్.


సరైనోడు తర్వాత కుర్రోడికి కాస్త పెరిగిందని వస్తున్న వార్తలను బన్ని ఎక్కడికక్కడ ఖండిస్తూ వస్తున్నా ఎక్కడో ఓ చోట మెగా అభిమానులే తన గురించి రివర్స్ లో ప్రచారం చేయడం గ్రహించిన బన్ని నష్టపరిహార చర్యలు చేస్తున్నాడు. ఇప్పటికే ఆడియో రిలీజ్ నాడు తాను ఈ స్టేజ్ లో ఉండటానికి పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా కారణమని వచ్చేలా చెప్పిన బన్ని చెప్పను బ్రదర్ ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడేసినట్టే అంటున్నారు.


దిల్ రాజు నిర్మించిన డిజె సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ మూవీతో తన హిట్ మేనియా కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. మరి బన్నికి డిజె ఎలాంటి మెమరబుల్ హిట్ ఇస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: