‘సర్దార్ గబ్బర్ సింగ్’ ‘కాటమరాయుడు’ సినిమాలు పవన్ అభిమానులకు నిరాశ పరచడమే కాదు పవన్ లుక్ పై అతడి వీరాభిమానులను సైతం ఖంగారు పడేలా చేసింది. అయితే ఈ నెగిటివ్ ఫీడ్ బ్యాక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వరకు వెళ్ళింది అనుకోవాలి. అందుకే త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీలో పవన్ డిఫరెంట్ గా చాల అందంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. 

దీనికోసం పవన్ ఆహార నియమాలలో అనేక మార్పులు త్రివిక్రమ్ సూచనలతో ఆచరించడంతో పవన్ లుక్ లో అనేక మార్పులు వచ్చాయని వార్తలు వచ్చాయి. దీనితో పవన్ లేటెస్ట్ లుక్ ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు పవన్ అభిమానులలో రోజురోజుకి పెరిగి పోతున్నాయి. 

దీనికి సమాధానంగా పవన్ త్రివిక్రమ్ ల మూవీ షూటింగ్ స్పాట్ లో పవన్ హడావిడి చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయింది. ‘కాటమరాయుడు’ సినిమాలో కొద్దిగా బుజ్జి పొట్టతో కనిపించి హడావిడి చేసిన పవన్ ఇప్పుడు ఆ పొట్టను బాగా తగ్గించుకుని సన్నపడటమే కాకుండా సినిమాలలో అయినా రాజకీయాలలో అయినా ఎప్పుడు తగ్గాలో లేదా ఎప్పుడు ఎదగాలో తనకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అన్న సంకేతాలు ఇస్తున్నాడు. 
 
‘జల్సా’  ‘అత్తారింటికి దారేది’ సినిమాలు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్లో వస్తున్న ఈమూవీ పై బయ్యర్లకు కూడ భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈసినిమాకు దాదాపు 120 కోట్ల వరకు బిజినెస్ ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో ఈమూవీని సంక్రాంతి బరిలో నిలపాలా లేదంటే ఇంకా ముందుగానే దీపావళి పండుగ సమయంలో విడుదల చేయాల అన్న సందిగ్ధంలో త్రివిక్రమ్ ప్రస్తుతం ఉన్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: