కోలీవుడ్ బ్యూటీ హన్సిక ప్రస్తుతం మంచి జోష్ మీద ఉంది. ఆమె సూర్య తో నటించిన మాస్ మసాలా సినిమా “సింగం-2” హిట్ అవడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పొయింది. పేరు కు ఆమె సెకండ్ హీరోయిన్ అయినా, అటు విమర్శకుల నుండే కాదు ఇటు ప్రేక్షకుల నుండి కూడా మంచి మార్కులు కొట్టేసింది. మొన్న హీరో సిద్ధార్ద్ తో చేసిన ‘సమ్ థింగ్ సమ్ థింగ్’ కోలీవుడ్ లో హిట్ టాక్ ను తెచ్చుకుంటే ఏకంగా సింగం-2 బ్లాక్ బస్టర్ గా ఆమె కెరియర్ లో మిగిలిపోయింది. ఇంత విజయాన్ని ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని హన్సిక తాను ప్రస్తుతం రంజాన్ ఉపవాసాలు చేస్తున్నట్లు తన ట్విట్టర్ లో తెలియజేసింది.

అంతేకాదు తాను సింగం సినిమాలో సాధించిన విజయాన్ని తన అభిమానులకు అంకితం చేస్తున్నట్లు తన ట్విట్టర్ లో పెద్ద పెద్ద మాటలే పెట్టింది. అత్యంత నియమ నిష్టలతో ముస్లిం లు అతి పవిత్రంగా భావించే రంజాన్ ఉపవాసాలు రోజుకు 14 గంటలపైన చెయ్యవలసి వస్తుంది. ఉదయం 4 గంటల తరువాత సాయంత్రం 7 గంటల వరకూ ముస్లిం లు మంచినీళ్ళు కూడా తాగకుండా అతి నియమనిష్టలతో చేసే ఉపవాసాలు ధైర్యంగా హన్సిక కూడా చేయడం ఆశ్చర్యపరచే విషయం. ఒక సెలబ్రిటీ జీవితాన్ని అనుభవిస్తూ, తనకు నచ్చిన భగవంతుడిని పూజించడం హన్సిక సంస్కారానికి గుర్తింపు అనుకోవాలి. ఎంతో కష్టపడి మన బబ్లీ గర్ల్ చేస్తున్న ఉపవాసాలతో ఆమె కెరియర్ మరింత పీక్ కు వెళ్తుందేమో చూడాలి.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: