కట్టప్ప ‘భాహుబలి’ ని ఎందుకు చంపాడు అన్న ప్రశ్నదేశంలోని ప్రతి వ్యక్తి మైండ్ లోకి చొచ్చుకుపోయేలా చేయడంలో రాజమౌళి అమోఘమైన స్ట్రాటజీలను ప్రయోగించడంతో ‘బాహుబలి 2’ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసి ఆ మ్యానియాలో అందరు కొట్టుకు పోయేలా చేసింది. అయితే ప్రస్తుతం వై కట్టప్ప కిల్డ్ ‘బాహుబలి’ అనే ప్రశ్నకు  సమాధానం దొరికినా ‘బాహుబలి 2’ లోని ఆ సీన్ ను ప్రేక్షకులు ఇప్పట్లో మరిచిపోయే స్థితిలో లేరు.

వాస్తవానికి కట్టప్ప ‘బాహుబలి’ ని పొడిచే ఆషాట్ ఐకానిక్ గా మారిపోవడంతో చాలామంది హీరో హీరోయిన్లు అప్పట్లో ఆ ఫోజును ఇమిటేట్ చేస్తూ చాలా ఫోటోలతో గతంలో తెగ హడావిడి చేసారు.  అయితే వెండితెరపై ‘బాహుబలి’ ని కట్టప్ప పొడిచేస్తే ఇక్కడ మాత్రం తాను ప్రభాస్ ను పొడిచేస్తున్నాను అంటూ తెగ హడావిడి చేస్తున్నాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్. 

ఈసంఘటన ముంబైలో జరిగింది ప్రస్తుతం ప్రభాస్ అమెరికా నుండి తిరిగి వచ్చి ముంబైలో టైం స్పెండ్ చేస్తున్నాడు. ఇలా ప్రభాస్ ఖాళీగా ముంబైలో ఎందుకు ఉన్నాడో తెలియకపోయినా ప్రభాస్ ను చాలమంది బాలీవుడ్ సెలెబ్రెటీలు కలుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

అంతేకాదు పార్టీలకు దూరంగా ఉండే ప్రభాస్ తో చాలమంది బాలీవుడ్ సెలెబ్రెటీలతో పార్టీలమధ్య జోష్ లో టైం స్పెండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈమధ్య జరిగిన ఒక పార్టీలో వరుణ్ ధావన్ ప్రభాస్ ను పొడిచేస్తున్నట్లు ఒక ఫోటో తీయించుకోవడమే కాకుండా ‘అక్కడ కట్టప్ప ఇక్కడ నేను ఆపని చేయగలిగాం'  అంటూ కామెంట్స్ పెట్టి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

అంతేకాదు తాను చూసిన స్టార్స్ అందరిలోకి ప్రభాస్ చాల కూల్ పర్సన్ అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపిస్తున్నాడు వరుణ్ థావన్. ఇలా ప్రభాస్ బాలీవుడ్ సెలెబ్రెటీలతో రోజులు గడపడం చూస్తూ ఉంటే ప్రభాస్ త్వరలోనే బాలీవుడ్ సినిమాలో నటించినా ఆశ్చర్యం లేదు అని అనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ బుట్టలో వేసుకోవడానికి కరణ్ జోహార్ రకరకాల భారీ పారితోషికాలను ప్రభాస్ కు ఆఫర్ చేస్తున్న నేపధ్యంలో యంగ్ రెబల్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: