సౌందర్యం అంటే ఒకనాటి కధానాయికలలో సావిత్రి దే అని చెపుతారు. ఆమె అందంలో ఒకరకమైన హుందా తనం కనిపిస్తుంది. అంతేకాదు ఆమె తన హావభావాలను కేవలం తన కన్నులతోనే పలికించగల మహానటి. అందుకే ఎన్ని ధశాభ్దాలు గడచిపోయినా టాలీవుడ్ రంగంలో మహానటి సావిత్రిని మించిన హీరోయిన్ ఇప్పటి వరకూ రాలేదు. భవిష్యత్ లో వస్తుందన్న ఆశ కూడా లేదు. సామాన్యంగా ఏ హీరోయిన్ అయినా సినిమాలలో అప్పటి నుంచి ఇప్పటి వరకూ నగలు వేసుకోవాల్సి వస్తే గిల్టు నగలనే వేసుకుంటారు.

ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చిట్టి పొట్టి దుస్తులతో నటించే నేటి టాప్ హీరోయిన్స్ కు అసలు నగల గొడవే లేదు. అది వేరే విషయం అనుకోండి.కాని సావిత్రి మటుకూ తను దక్షినాది సినిమాలలో ఒక వెలుగు వెలిగే రోజులలో ఏనాడూ గిల్టు నగలు పెట్టుకొనేది కాదట. అన్నీ బంగారు నగలే వాడేదట. రేపటి షూటింగ్ కు ఎటువంటి నగలు పెట్టుకొని రావాలి అని దర్శకున్ని అడిగి తెలుసుకొని, తన బీరువాలో ఉన్న ఎన్నో నగలలోంచి ఆ పాత్రకు సూట్ అయ్యే బంగారు నగలను పెట్టుకొని మాత్రమే షూటింగ్ కి వచ్చేదట మహా నటి సావిత్రి. ఒక చిన్న ముఖమల్ సంచిలో జాగ్రతగా తన నగలను షూటింగ్ కు తీసుకువచ్చి మళ్ళి తీసుకువెళ్ళిపోయేదట.

ఆరోజులలో సావిత్రి దగ్గర ఉన్న నగల కలెక్షన్స్ భారతదేశం లోని ఏ హీరోయిన్ దగ్గర లేవని చెప్పుకొనే వారు. అంతటి ఐశ్వర్యాన్ని అనుభవించిన సావిత్రి చివరి దశలో తన ఒంటిపై సరైన నగలే లేకుండా కన్ను మూయడం చూస్తే విధి ఎంతటి వారిని అయినా లొంగదీసుకుంటుంది అనే విషయానికి ప్రత్యేక్ష నిదర్శనంగా చెప్పుకోవాలి. బంగారు నగలపై ఎంతో మక్కువ పెంచుకున్న సావిత్రి, తన జీవితం పట్ల మక్కువ పెంచుకోకుండా తన జీవితం పై తానే ప్రయోగాలు చేసుకొని చరిత్రలో మిగిలిపొయింది అలనాటి మహానటి సావిత్రి.

మరింత సమాచారం తెలుసుకోండి: