సునీల్ త్రివిక్రమ్ లు ఎప్పటినుంచో మంచి స్నేహితులు. ఆ స్నేహంతోనే తిరిగి తన కెరియర్ కి ఒక బ్రేక్ ఇచ్చే సినిమా అవకాశం త్రివిక్రమ్  నుంచి వస్తుందని ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నాడు సునీల్. అయితే ఆ ఆశల పై పవన్ త్రివిక్రమ్ లు ఒకేసారి ఆశలపై నీళ్ళు జల్లడం ఇప్పడు హాట్ టాపిక్ గా మారి పోయింది.

మంచి స్నేహితులైన పవన్ వెంకటేష్ లు ‘గోపాల గోపాల’ తరువాత తిరిగి మళ్ళీ త్రివిక్రమ్ పవన్ తో తీస్తున్న లేటెస్ట్ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీలో వెంకటేష్ 6నిముషాల ప్రత్యేక పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీలోని వెంకటేష్ పాత్ర ఒక కీలకమైన సీన్ లో వచ్చి విపరీతంగా నవ్విస్తుంది అని తెలుస్తోంది. 

మొదట్లో ఈ ప్రత్యేక పాత్రను సునీల్ చేత చేయించాలని త్రివిక్రమ్ భావించినట్లు టాక్. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీకి మరింత హైక్ తీసుకు రావడానికి ప్రత్యేక పాత్రలో ఒక స్టార్ హీరో నటిస్తే బాగుంటుంది అన్న ఆలోచన త్రివిక్రమ్ కు రావడంతో పవన్ సలహా మేరకు వెంకటేష్ ను కలవడం జరిగిందని తెలుస్తోంది. 

వెంకటేష్ కు ఈ ప్రత్యేక పాత్ర బాగా నచ్చడంతో పవన్ త్రివిక్రమ్ లతో తనకున్న సాన్నిహిత్యంతో వెంటనే ఈ గెస్ట్ రోల్ కు ఒప్పుకోవడం నిన్నటి నుంచీ ఈ మూవీ షూటింగ్ స్పాట్ లో జాయిన్ కావడం అన్నీ చాల వేగంగా జరిగిపోయాయి అని టాక్. అయితే ఈ పాత్ర తనకే వస్తుందని ఆశపడ్డ సునీల్ కు ఈ న్యూస్ షాకింగ్ గా మారింది అని టాక్. 

అయితే ఈ సినిమా బిజినెస్ ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక పాత్రలో వెంకటేష్ ను నటింప చేస్తున్నామని తన తదుపరి సినిమాలో సునీల్ కు మంచి క్యారెక్టర్ క్రియేట్ చేసి తన స్నేహితుడుకు బ్రేక్ వచ్చేలా చేస్తానని త్రివిక్రమ్ సునీల్ కు మాట ఇచ్చి నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ లేటెస్ట్ మూవీలో తిరిగి పవన్ వెంకటేష్ లు కలిసి నటించడం సంచలన వార్తగా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: