తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య కొత్త హీరోల జోరు బాగా పెరిగిపోయింది.  ఇప్పటికే వారసుల హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు..అయితే పొలిటికల్ బ్యాగ్ గ్రౌండ్ నుంచి చాలా తక్కువ మంది వచ్చారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'జయదేవ్‌`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడక హైదరాబాద్ లో జరిగింది.
Jayadev Movie Pre Release Function Photos
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గంటా శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. నన్ను అన్న‌య్య అని నోరారా ఆప్యాయంగా పిలిచే గంటా శ్రీనివాస‌రావు కుమారుడు గంటా ర‌వి న‌టించిన తొలి సినిమా ఆడియో లాంఛ్‌లో పాల్గొన‌డం ఆనందంగా ఉంది. మా ఇద్ద‌రి అనుబంధం రాజ‌కీయంగా ప్రారంభ‌మైనా, రాజకీయాల‌కు అతీతంగా, కుటుంబ ప‌ర‌మైన బంధం ఏర్ప‌డింది. శ్రీనివాస‌రావు నా కుటుంబంలో ఓ స‌భ్యుడైయ్యాడు.
Jayadev Movie Pre Release Function Photos
నాకు నిజమైన ఆత్మీయుడు. శ్రీనివాస‌రావుకు సినిమాలంటే చాలా ఇష్ట‌ముండేద‌ని నాకు అర్థ‌మ‌వుతుంది. అందువ‌ల్లే సినిమా ఇండ‌స్ట్రీలో అంద‌రితో మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. త‌న‌కు తీర‌ని కోరిక త‌న కొడుకుతో తీర్చుకున్నందుకు వారెంతో ఆనందంగా ఉన్నారని వారిని చూడ‌గానే తెలుస్తుంది. ర‌విని చూస్తుంటే మ‌నిషి మ్యాచోగా అనిపిస్తున్నాడు. 

Jayadev Movie Pre Release Function Photos

ఇదే కార్యక్రమంలో మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల చేశారు.  ఈ కార్యక్రమంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస‌రావు, మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ డా. మంచు మోహ‌న్‌బాబు, కె.రాఘ‌వేంద్రరావు, టి.సుబ్బరామిరెడ్డి, అల్లు అర‌వింద్‌, డి.సురేష్‌బాబు, సి.క‌ళ్యాణ్‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌, పివిపి ప్ర‌సాద్‌, పెంబ‌ర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌నారాయ‌ణ‌, బెల్లంకొండ సురేష్‌, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, మ‌హేష్‌రెడ్డి, దామోద‌ర్ ప్ర‌సాద్‌, బూరుగుప‌ల్లి శివ‌రామ‌కృష్ణ, కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, కె.ఆచ్చిరెడ్డి, బి.గోపాల్‌, కె.ఎస్‌.రామారావు.
Jayadev Movie Pre Release Function Photos
 ఇంకా వైజాగ్ సౌత్ ఎమ్మెల్యే గ‌ణేష్ బాబు, జెమిని కిర‌ణ్‌, ల‌గ‌డ‌పాటి శ్రీధ‌ర్‌, ఆదిశేష‌గిరిరావు, వ‌జ్రా శ్రీనివాస‌రావు, కుమార్ చౌద‌రి, అశ్వ‌నీద‌త్‌, మారుతి,  య‌ల‌మంచిలి ఎమ్మెల్యే ర‌మేష్‌బాబు, ర‌ఘురామ‌కృష్ణంరాజు, విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే అనిత‌, కె.వి.రావు, చాముండి, లాలం భాస్క‌ర్‌రావు, గోవింద్‌రావు, ప‌ల్లా శ్రీనివాస‌రావు, డైరెక్ట‌ర్ జ‌యంత్ సి.ప‌రాన్జీ, నిర్మాత కె.అశోక్ కుమార్‌, అవంతి శ్రీనివాస్‌, వేణుగోపాలాచారి, వినోద్ కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: