రేపటి రోజున విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’ మూవీని ప్రమోట్ చేస్తూ అల్లు అర్జున్ అనుకోకుండా అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి. చిరంజీవి అంటే అల్లు అర్జున్ కు ఉన్న అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. 

చిరంజీవి పై ప్రేమను వ్యక్త పరిచే సందర్భంలో గతంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడ విలన్ గా మారిపోయాడు. ఇప్పుడు అదే చరిత్ర రామ్ చరణ్ అభిమానుల విషయంలో కూడ జరగడం ఆశ్చర్యంగా మారింది. మీడియా సంస్థలతో తన ‘డిజే’ కోసం మాట్లాడుతున్న చరణ్ కు ఈ అనుకోని సంఘటన ఎదురైంది. 

ఒక మీడియా సంస్థ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ తనకు చిరంజీవి పట్ల ఎంతో ఇష్టం ఉన్నా తన సినిమాలలో చిరంజీవి సినిమాలలోని పాటలను రీమిక్స్ చేయడం తనకు ఇష్టం ఉండదు అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు చిరంజీవి ఒరిజనల్ స్టైల్ అని అంటూ దానిని అనుకరించడం పద్ధతి కాదు అని అభిప్రాయపడుతూ తనకు ఒరిజనల్ గా ఉండటం ఇష్టం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

గతంలో ఒకసారి తాను తన సినిమాలకు సంబంధించి చిరంజీవి డైలాగ్ చెప్పడానికి ప్రయత్నించిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆ ప్రయత్నం తనకే నచ్చక పోవడంతో ఆ ప్రయత్నాన్ని ప్రాధమిక దశలోనే వదిలి వేసిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఈ మాటలే అల్లుఅర్జున్ కు సమస్యగా మారాయి అన్న వార్తలు వస్తున్నాయి.

దీనితో యాదృచ్ఛికంగా తన వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిన మాటలు రామ్ చరణ్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి పాటలను చరణ్ చాలసార్లు రీమిక్స్ చేసాడు. ఇదే పద్ధతిని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడ అనుసరించాడు. ఈ విషయాలు అన్నీ తెలిసి కూడ అనాలోచితంగా చరణ్ ను టార్గెట్ చేసే విధంగా అల్లు అర్జున్ ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసాడు అంటూ చరణ్ అభిమానులు ఈ విషయమై ప్రస్తుతం అసహనంతో బాధ పడుతూ లోతైన చర్చలు తమలో తాము చేసుకుంటున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: