తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్ల హవానే కొనసాగుతుంది.  తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు పెద్దగా చాన్సులు ఇవ్వక పోవడం..ఇతర భాషల అమ్మాయిలతో ఎలాగైనా నటింప చేయొచ్చు అన్న ధీమాతో చాలా మంది దర్శక, నిర్మాతలు వారికే చాన్సులు ఇస్తున్నారు.  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా వెలిగిపోతున్న కాజల్, సమంత,తమన్నా,రకూల్ ప్రిత్ సింగ్, రాశీ కన్నా, రెజీనా లాంటి వారందరూ పర భాషకు చెందిన హీరోయిన్లు.  
Image result for rakul preet singh hot photos
మరో ట్విస్ట్ ఏంటంటే తెలుగు లో మంచి సక్సెస్ సాధించిన హీరోయిన్లు అనూహ్యంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది.  ఆ తరం హీరోయిన్లు శ్రీదేవి, జయప్రద అయితే ఇదే బాటలో నడిచారు..ఇలియానా, తమన్నా లాంటి కొంత మంది హీరోయిన్లు.  తాజాగా వీరి బాటలో నడవబోతుంది..బాలీవుడ్ హాట్ బ్యూటీ రకూల్ ప్రిత్ సింగ్.  తెలుగు లో ఈ అమ్మడు టాప్ హీరోలందరితో నటించింది.  పైగా గ్లామ‌ర్ షో లో కూడా పెద్ద‌గా హ‌ద్దులేవీ లేక‌పోవ‌డంతో ఈజీగానే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
Image result for rakul preet singh hot photos
ప్ర‌స్తుతం మ‌హేశ్ తో స్పైడ‌ర్.. బెల్లంకొండ శ్రీ‌నివాస్ తో జ‌య జాన‌కీ నాయ‌కా సినిమాలు చేస్తుంది ర‌కుల్.  ఈ రెండింటితో పాటు త‌మిళ్ లో కార్తితో ఓ సినిమా చేస్తుంది ర‌కుల్. ఇవ‌న్నీ ఇలా ఉండ‌గానే ఇప్పుడు హిందీలో ఓ సినిమాకు సైన్ చేసింది ర‌కుల్. నీర‌జ్ పాండే తెర‌కెక్కించబోయే ఐయారా సినిమా కోసం ఈమెను తీసుకున్నారు.  
Image result for rakul preet singh hot photos
ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ అమ్మడు యారియాన్ సినిమాలో నటించింది.  అక్కడ సక్సెస్ సాధించలేక టాలీవుడ్ లో కి రావడం ఇక్కడ వరుసగా సినిమా చాన్సులు రావడంతో మంచి పేరు సంపాదించింది.  మొత్తానికి సొంత ఇండ‌స్ట్రీలో ఓ సినిమాకు సైన్ చేసిన ఈ అమ్మడు అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందా అని అనుకుంటున్నారు సినీ ప్రేమికులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: