తన మొదటి సినిమా ఘోర పరాజయం తరువాత ఎన్నో ఆలోచనలు చేసిన అఖిల్ తన రెండో సినిమా షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన పలు యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్  షెడ్యూల్ ముగిసింది. 

యాక్షన్ అండ్ లవ్ జోనర్ గా చిత్రీకరింపబడుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ పై ఇప్పటికే రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈమూవీకి ‘జున్ను’ అన్న టైటిల్ పెడతారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే సోషల్ మీడియాలో ఈ టైటిల్ కు చాల నెగిటివ్ రియాక్షన్ వచ్చిన నేపధ్యంలో మరొక కొత్త టైటిల్ కోసం ఈ సినిమా యూనిట్ చాల తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు టాక్. 

దీనితో జాగ్రత్తపడ్డ నాగార్జున ఈసినిమా విషయమై మరొక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమా టైటిల్ కు సంబంధించి నాగార్జున తీసుకున్న నిర్ణయం నాగార్జున గతంలో నటించి ఘోరంగా ఫెయిల్ అయిన సినిమా ‘నిర్ణయం’ ఛాయలతో ఉండబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి. గతంలో నాగార్జున అమలతో కలిసి నటించిన ‘నిర్ణయం’ ఫెయిల్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఆ మూవీలోని ‘హలో గురూ ప్రేమకోసమే’ పాట అప్పట్లో సూపర్ హిట్. ఇప్పటికీ ఆ పాటను చాల ఛానల్స్ తమ కార్యక్రమాలలో ప్రసారం చేస్తూనే ఉంటాయి. ఇప్పుడు అదే పాటను టైటిల్ గా అఖిల్ సినిమా కోసం పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలలో నాగార్జున టీమ్ ఉన్నట్లు టాక్. అఖిల్ నటిస్తున్నది యాక్షన్ తో కూడిన లవ్ సబ్జక్ట్ కాబట్టి ఈ ‘హలో గురూ ప్రేమకోసమే’ టైటిల్ నేటి తరం యూత్ కు కూడ బాగా కనెక్ట్ అవుతుందని నాగార్జున భావిస్తున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: