పవన్ సినిమాలలో బ్లాక్ బస్టర్ పేరుగాంచిన ‘గబ్బర్ సింగ్’ సినిమాలోని  ‘నాక్కొంచెం తిక్కుంది.. కానీ దానికో లెక్కుంది..' డైలాగ్ ను పవన్ అభిమానులు ఇప్పటికీ మరిచిపోరు. ఈ డైలాగ్ కోసమే పవన్ వీరాభిమానులు చాల సార్లు ‘గబ్బర్ సింగ్’ సినిమాను చూసారు అంటే అతిశయోక్తి కాదు. ఇంతగా పాపులర్ అయిన ఈ డైలాగ్ ను అనుసరిస్తూ చాల చాలామంది హీరోలు ఈ డైలాగ్ ను వాడారు.

ఇప్పుడు ఈ ప్రయోగాన్ని నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడ చేసాడు. ప్రస్తుతం పరజయాలలో ప్రయాణిస్తున్న ఈ మెగా యంగ్ హీరోకి ఒక హిట్ కావాలి దీనికోసమే రకరకాల ప్రయోగాలు చేస్తూ ప్రస్తుతం శేఖర్ కమ్మల దర్శకత్వంలో నటిస్తున్న ‘ఫిదా’ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈసినిమా హట్ అవ్వడం వరుణ్ తేజ్ కెరియర్ కు చాల కీలకంగా మారడం తో ఈమూవీలో వరుణ్ తన బాబాయి తిక్క డైలాగ్ ను వాడుతున్నాడు. 
   
ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన టీజర్ లో హీరో వరుణ్ తేజ్  హీరోయిన్‌ సాయి పల్లవిని ఉద్దేశించి 'తిక్కుంటే లెక్కుండాలి. ఈ పిల్లకి నో లెక్క ఓన్లీ తిక్క..' అంటూ ఒక డైలాగ్‌ చెప్పి కనీసం పవన్ డైలాగ్ అయినా తనకు కలిసి వస్తుందేమో అన్న ప్రయోగాలు చేస్తున్నాడు. విదేశాల్లో సెటిల్ అయిన కుర్రాడు, అచ్చంగా తెలంగాణలోని పల్లెటూరికి చెందిన అమ్మాయి వీరిద్దరి  మధ్య జరిగే ప్రేమ కథ ఈ 'ఫిదా'. 

ట్రైలర్‌ ని అయితే నీట్‌గానే శేఖర్ కమ్ముల మార్క్ తో కట్‌ చేసేశారు కానీ ఈసినిమాలో కొత్తగా కనిపించే స్టోరీ పాయింట్ ఏమిలేదా ? అన్న సందేహం ఈ ట్రైలర్ చూసిన వాళ్లకు వస్తోంది. ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ మూవీ దియేటర్లలో ఇంట్రవెల్ లో ఈసినిమాను చూపెడుతూ బన్నీ అభిమానులకు కూడ వరుణ్ తేజ్ ను దగ్గర చేయడానికి ప్రయత్నిస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: