పవన్ కళ్యాణ్ కు ఆధ్యాత్మికత చాల ఎక్కువ అన్న విషయం అతడి సన్నిహితులు అనేక సార్లు చెపుతూ ఉంటారు. అయితే పవన్ తో నటించిన హీరోయిన్స్ కు కూడ ఈ ఆధ్యాత్మికత లక్షణం అలవాటు కావడం ప్రస్తుతం సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 

పవన్ కళ్యాణ్ తో కొంతకాలం క్రితం నటించిన ‘తీన్ మార్’ మూవీతో కృతి కర్బందా కు మంచి పాపులారిటీ వచ్చినా ఆ సినిమా ఫెయిల్ అవ్వడంతో ఈ సినిమా వల్ల పాపులారిటీ  వచ్చినా ఈ సినిమా ఫెయిల్ అవడంతో ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలు ఏమిరాలేదు. ఆ తరువాత ఆమె ‘ఒంగోలు గిత్త’ ‘బ్రూస్ లీ’ లాంటి సినిమాలలో నటించినా ఆ సినిమాలు ఆమెకు ఏ మాత్రం గుర్తింపు తెచ్చి పెట్టలేదు.

ఈ నేపధ్యంలో ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ అక్కడ ఆమె కూడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ నేపధ్యంలో ఆమె ప్రస్తుతం నటిస్తున్న ఒక బాలీవుడ్ సినిమా కోసం లండన్ షూటింగ్ కు వెళ్ళింది. మధ్యలో ఈమూవీకి బ్రేక్ రావడంతో అందరూ లండన్ చుట్టుపక్కల ప్రాంతాలను చూడటానికి వెళ్ళిపోతే ఆమె మాత్రం లండన్ లోని ఒక గురు ద్వారాని శుభ్ర పరుస్తూ తన ఆధ్యాత్మికతను చాటుకుంది. 

ఈ ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో చూసిన చాలామంది కృతి ఆధ్యాత్మికతకు ముచ్చట పడుతూ ఈ ఫోటోని ఒకరికొకరు షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈరోజు సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: