all actors of mega family కోసం చిత్ర ఫలితం


ఎందుకు మెగా కుటుంబం సినిమాల్లో వేరేనటుల కుటుంబాలని టార్గెట్ చేస్తున్నారు. అలాగే బ్రాహ్మణ, వైశ్య, కమ్మ ఇలా అనేక కులాల ప్రస్థావన వస్తుంది. వేద-వేదాంగాల వైదిక సంస్కృతి నుండి జాలువారిన 'నమక చమకాల'పై మలిన శృంగారం తో కూడిన గేయాలు వారి సినిమాల్లో అలజడికి కారణమౌతున్నాయి. అంతే కాదు గీతా ఆర్ట్స్ బానర్ పై వచ్చిన మగధీర 'చందేరీ అనే ఎస్పి చారి నవల' ను కాపీగొట్టిందే. అయినా  రాబ్తా హిందీ సినిమా మగధీరకు కాపీ అని "దొంగే దొంగను దొంగ" అని గోల చేసినట్లు ప్రవర్తించటం వారికే చెల్లింది. 


వివరాలలోకి వెళ్ళితే ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రానికి హైలెట్ గా నిలిచిన సిటీ-మార్ పాటలో అల్లు అర్జున్, పూజా హెగ్డేలు  దుమ్ము రేపినా ఆ పాటలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మెగాస్టార్ అంటూ ముగ్గురు హీరోలను ప్రస్తావించే పదాలు ఆ పాటలో ఉన్నాయి ఈ పాటకు డాన్స్ చేస్తూ బన్నీ ఎన్టీఆర్, ఏఎన్నార్, మెగాస్టార్ అంటున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఎన్టీఆర్ ఏఎన్నార్ మెగాస్టార్ ఫోటోలు ప్రత్యక్షం అవుతాయి. అయితే మహానటులు అక్కినేని నందమూరి ఫోటోలను సైడ్ లో చూపెట్టి మెగాస్టార్ చిరంజీవి ఫోటోను టాప్ భాగంలో హైలెట్ చేస్తూ చూపెట్టారు.

dj duvvada jagannadham photos కోసం చిత్ర ఫలితం

వాళ్ళిద్దరు చిరంజీవికి మల్లే అంతకంటే ముందే  తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలే అదీ తెలుగు చిత్రసీమకు కళాకాంతులు తెచ్చిపెట్టి విభిన్న పాత్రలు పోషించి విశ్వవిఖ్యాతి పొందినవారే.  అలాంటి వారికి తగిన గౌరవం ఇస్తే మెగా కుటుంబం గౌరవం పెరుగుతుందే తప్ప అగౌరవం అంటదు. అసలు మెగా కుటుంబంలో ఏవరనైనా శ్రీ కృష్ణ పాత్రగాని,  దాన వీర శూర కర్ణలో దుర్యోధన పాత్రగాని చేసి ఆస్థాయిలో మెప్పించగలరా! ఇప్పుడు ఈ విషయంపై నందమూరి,  అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని  అభ్యంతరాలను వ్యక్త పరుస్తున్నారు. మొత్తం మెగా కుటుంబాల కథానాయకులకు (చిరంజీవి, పవన్ కళ్యాణ్ తప్ప)  అనునాశికాలతో (ఙ్జ, ఞ్, ణ, ళ ) వచ్చే వాక్యాలు పలక లేని విద్యావంతులు, బాషా ఙ్జాన శూన్యులు.       
  
అంతేకాదు మదమెక్కిన సంభాషణలు:


‘బెజవాడలో పైన అమ్మవారు క్రింద కమ్మవారు’ అనే పంచ్ రాతల్లో బాగున్నా నిజంగా నిజమైనా సినిమా యవనిక పై చూపటం సభ్య సమాజానికి ఏ మెసేజ్ పంపుతుందో అల్లు అర్జున్ కు తెలియదా! ఈ సినిమా దర్శకుని వ్యవహారం ప్రవర్తన సభ్యసమాజం హర్షించదని అభిజ్ఞవర్గాల కథనం. 


అంతేకాదు కమ్మ సామాజిక వర్గ సమాజంలో మహిళల పెత్తనం చాలా ఎక్కువ అని మగవారికి కుటుంబ విషయాల్లో అంత ప్రాధాన్యం ఉండదని అన్న డైలాగ్ కూడ కమ్మ సామాజిక వర్గంలోని వారికి అత్యంత ఆగ్రహాన్ని తెప్పించినట్లు తెలుస్తోంది. ఇలా ఎలా చూసుకున్నా మన తెలుగు రాష్ట్రాలలో అన్ని విషయాలలోనూ ప్రముఖమైన బ్రాహ్మణ కమ్మ సామాజిక వర్గాలలోని చాలా మంది మనోభావాలను ‘డిజే’ దెబ్బ తీసి ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఈ తీరు మెగా కుటుంబానికి మరణ సదృశమే అని ఆ బానర్ కే కాదు తెలుగు సినిమా రంగం లో ఉన్న కులాల కుమ్ములాటలను "మేడుపండు చందం" గా బయట పెడుతున్నాయి.
all actors of mega family కోసం చిత్ర ఫలితం

ఇప్పటికైనా చిరంజీవి గారు కలగచేసుకోని వారి ప్రవర్తనను సవరించకపోతే ఆయన కుటుంబానికి సాధించిపెట్టిన గౌరవం డ్రెయినేజ్ పాలైనట్లే. కష్టపడి పైకొచ్చిన అల్లు రామలింగయ్యగారు, చిరంజీవిగారికి సంస్కృతి సంస్కారం తెలుసు. మిగిలిన వారంతా నోట్లో బంగారు చెంచాతో పుట్టినవారు కాబట్టి వారికి సంస్కారం నేర్పాల్సిన బాధ్యత ఆ కుటుంబ గౌరవానికి ఆది పురుషుడై న చిరంజీవిగారిదే.  సభ్య సమాజానికి వీరు మెసేజ్ లివ్వటం మాని సభ్యత తెలుసుకుంటే మంచిది. ఇదే సభ్య సమాజం నుండి మెగా కుటుంబానికి ప్రజలిస్తున్న మెసేజ్. 

 dj duvvada jagannadham photos కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: