అల్లుఅర్జున పవన్ అభిమానుల మధ్య వార్ జరుగుతున్న నేపధ్యంలో ఆ వార్ ప్రభావం ఎంతో కొంత ‘దువ్వాడ జగన్నాథం’ రిజల్ట్ పై పనిచేసింది అన్న వాస్తవాలు ఓపెన్ సీక్రెట్ గా మారాయి. బన్నీ పై వ్యతిరేకంగా పనిచేస్తున్న యాంటి ఫ్యాన్స్ ను కట్టడి చేయాలని అల్లు అర్జున్ టీమ్ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించినా ఆప్రయత్నాల రిజల్ట్ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.

అయితే ఈ రిజల్ట్ తో సంబంధం లేకుండా అల్లుఅర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ మూవీకి వచ్చిన భారీ కలక్షన్స్ పై స్పందిస్తూ చేసిన కామెంట్ పవన్ అభిమానులను ఆశ్చర్య పరిచేలా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. “నేను మీలో కొంతమందికి నచ్చకపోయినా నా సినిమాను చూసి నన్ను ఇంతవాడిని చేసినందుకు థ్యాంక్స్. నన్ను ఇష్టపడ్డా.. ఇష్టపడకపోయినా.. నా సినిమా చూసినందుకు థ్యాంక్స్. అలాగే అభిమానులుకు ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులకు చాలా  కృతజ్ఞతలు” అంటూ బన్నీ వ్యూహాత్మకంగా చేసిన కామెంట్స్ అన్యాపదేసంగా పవన్ అభిమానులను మళ్ళీ కేలికినట్లుగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

అంతేకాదు తన పై ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా తన సినిమాల కలక్షన్స్ జోరు తగ్గదు అన్న ఆత్మ విశ్వాసం బన్నీ కామెంట్స్ లో కనిపిస్తోంది. ఇది ఇలా ఉండగా ‘దువ్వాడ’ సినిమాకు నిన్న రెండవ రోజు కూడ మన ఇరు రాష్ట్రాలలోను మంచి కలక్షన్స్ రావడంతో ఈసినిమా పై ప్రచారంలోకి వచ్చిన డివైడ్ టాక్ ఏ మాత్రం ప్రభావం చూపెట్టలేక పోయింది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ‘దువ్వాడ’ కలక్షన్స్ ను విశ్లేషిస్తే ‘ఖైదీ నెంబర్ 150’ ‘జనతా గ్యారేజ్’ మూవీల ఓపెనింగ్ కలక్షన్స్ స్థాయిలో లేకపోయినా రామ్ చరణ్ ‘ధృవ’ ఓపెనింగ్ కలక్షన్స్ కన్నా చాల మెరుగైన స్థానంలో ఉండటంతో చిరంజీవి పవన్ ల తరువాత భారీ ఓపెనింగ్స్ రాబట్టగల స్థాయి ఒక్క బన్నీకి మాత్రమే ఉంది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియ చేసే విధంగా ‘దువ్వాడ’ కలక్షన్స్ ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది. ఏది ఎలా చూసినా అల్లుఅర్జున్ వ్యూహాత్మకంగా తన సినిమా కలక్షన్స్ పై చేసిన కామెంట్స్ వెనుక ఎన్నో అర్ధాలు ఉన్నాయి అన్న ప్రచారం జరుగుతోంది..     


మరింత సమాచారం తెలుసుకోండి: