భారీ అంచనాల మధ్య గత శుక్రువారం విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’ అసలైన పరీక్ష రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈరోజుతో వరస హాలిడేస్ వల్ల వచ్చిన లాంగ్ వీకెండ్ పూర్తి అవుతూ ఉండటంతో ఈ సినిమాకు బన్నీ కెరియర్ లో ఎప్పుడూ రానటువంటి భారీ ఓపెనింగ్ కలక్షన్స్ వచ్చినా రేపటి నుంచి ఈ సినిమా కలక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి కొన్ని బిసి సెంటర్లలో నిన్న ఆదివారం అయినప్పటికీ సినిమా కలక్షన్స్ విషయంలో డ్రాప్ కనిపించింది అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఈసినిమాకు ఈ పరిస్థితి రావడం వెనుక బన్నీ ఈసినిమా కథ విషయంలో కెలికిన విపరీతమైన కెలుకుడు కారణం అంటూ మరొక ప్రచారం జరుగుతోంది.

వాస్తవానికి దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు సంబంధించి వ్రాసుకున్న కథలో అనేక మార్పులు జరిగాయి అని దీనికి కారణం బన్నీ అత్యుతాహం అంటున్నారు. ముఖ్యంగా ఈసినిమా క్లైమాక్స్ విషయంలో అనుసరించిన కొత్త పద్ధతి వెనుక అల్లుఅర్జున్ ఆలోచనలు ఉన్నాయి అన్న విషయాన్ని ఇప్పటికే దర్శకుడు హరీష్ శంకర్ ఓపెన్ గా చెప్పిన విషయం తెలిసిందే. 

అయితే ఈ ప్రయోగం బిసి సెంటర్ల ప్రేక్షకులకు నచ్చలేదు అని అంటున్నారు. దీనితో ఈ సినిమా బయ్యర్లు ఖంగారు పడకుండా ఈ సినిమా ‘థాంక్స్ గివింగ్ మీట్’ ను నిర్వహించి ఈసినిమా హిట్ అంటూ ప్రచారం చేసి ఈసినిమా బయ్యర్లకు ధైర్యం చెప్పే ఆలోచనలలో ఈ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్లు టాక్. అయితే సినిమా విడుదల అయి వారం కూడ పూర్తి కాకుండానే ఈ డివైడ్ టాక్ మధ్య థాంక్స్ గివింగ్ ఆలోచనలు ఏమిటి అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: