ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో మౌనంగా ఉంటున్న రేణు దేశాయ్ తన మౌనాన్ని వీడి పవన్ హ్యాపీ ఫ్యామిలీ విషయాలను బయట పెట్టింది. పవన్ అభిమానులకే కాదు అందరికీ షాక్ ఇచ్చే విధంగా పవన్ కొడుకు అకిరా నందన్ – కూతురు ఆద్య లతో రేణు దేశాయ్ కలిసి తీయించుకున్న ఒక లేటెస్ట్ ఫోటోను తన ట్విటర్ లో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. 

ఇప్పటి వరకు చిన్న పిల్లవాడిలా చాల ఫోటోలలో కనిపించిన అకిరా నందన్ టీన్ ఏజ్ లోకి అడుగు పెట్టాడు అని సంకేతాలు ఇస్తూ ఇంచుమించు రేణు దేశాయ్ తో సమానంగా అకిరా నందన్ పొడుగు ఎదిగాడు అని తెలిపే విధంగా ఉన్న ఆ లేటెస్ట్ ఫోటో ఈరోజు సోషల్ మీడియాకి హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఇప్పటి నుంచి అకిరా నందన్ చిన్న పిల్లవాడు కాడు అని సంకేతాలు ఇస్తోంది రేణు దేశాయ్.

పవన్ రేణు దేశాయ్ లు విడిపోయినా తరుచూ పవన్ తన పిల్లలను చూసుకోవడానికి పూనా వెళ్ళి వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈమధ్య కాలంలో త్రివిక్రమ్ సినిమాలో బిజీగా ఉన్న నేపధ్యంలో పవన్ తన పిల్లల కోసం రేణు దేశాయ్ ఇంటికి వెళ్ళి ఉండడు. అందువల్లనే అకిరా ఎంత ఎదిగాడో పరోక్షంగా పవన్ కు తెలిసి విధంగా ఈ ఫోటోను రేణు సోషల్ మీడియాలో షేర్ చేసి ఉంటుంది.

బాగా పొడుగు ఎదిగిన అకిరా నందన్ ను చూస్తూ ఉంటే మరో నాలుగైదు ఏళ్ళల్లో తాను కూడ పవన్ వారసుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాను అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అప్పటికీ పవన్ ప్రత్యక్ష రాజకీయాలలో పూర్తిగా మునిగిపోయి ఉంటాడు కాబట్టి పవన్ వీరాభిమానులకు ఐకాన్ గా ఇక అకిరా నందన్ మారుతాడు అనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: