హీరో రానా హోస్ట్ చేస్తున్న ‘నెం.1 యారి’ షో నిన్నటి నుంచి ఒక ప్రముఖ ఛానల్ లో ప్రారంభం అయింది. ఈ మొట్టమొదటి షోకు దర్శకుడు రాజమౌళి అతిధిగా రావడంతో ఈ షో ప్రారంభం నుండి అందరి దృష్టిని ఆకర్షించి నిన్న ఈ షోకు మంచి రేటింగ్స్ అన్న వార్తలు వస్తున్నాయి. 

ఈ షోకి అతిధిగా వచ్చిన రాజమౌళి ఈషోలో చాల ఉత్సాహంగా పాల్గొని రానా అడిగిన అనేక ఆసక్తికర ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంలో రానా పవన్ కళ్యాణ్ తో మీరు ఎప్పుడు సినిమా చేస్తున్నారు అని ప్రశ్నించినప్పుడు రాజమౌళి చాల విభిన్నమైన సమాధానం ఇచ్చాడు. 

తనకు తెలిసినంత వరకు పవన్ పూర్తి స్థాయి రాజకీయాలలోకి వెళ్ళిపోవడం ఖాయం అని అంటూ పవన్ రాజీకీయ ప్రవేశం చేసే లోపుగా తమ ఇద్దరి కాంబినేషన్ లో సినిమాను చేసే అవకాశం లేదని అయితే పవన్ తో సినిమాలు చేయాలని ఎంతటి గోప్పటి దర్శకుడైనా కోరుకుంటాడు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు రాజమౌళి. అంతేకాదు పవన్ లాంటి నిజాయితీగల వ్యక్తులు చాల అరుదుగా ఉంటారు అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ పవన్ అభిమానులకు బాగా కనెక్ట్ అవుతాయి. 

ఇదే సందర్భంలో రాజమౌళి పవన్ గురించి మాట్లాడుతూ తాను పవన్ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే పవన్ వ్యక్తిత్వంలోని మంచి లక్షణాలు తనకు గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు ఆనందం కలుగుతుందని అంటూ మరొక ఆసక్తికర కామెంట్స్ చేసాడు జక్కన్న. అయితే పవన్ అభిమానులు ఎప్పటి నుంచో రాజమౌళితో పవన్ ఒక సినిమా చేయాలని కోరుకుంటున్న నేపధ్యంలో రాజమౌళి చెప్పిన సమాధానంతో ఇక వారిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం లేడు అన్నది సుస్పష్టం..   


మరింత సమాచారం తెలుసుకోండి: