ఒకొక్కసారి ఒకొక్క సినిమాకు ఎవరి అంచనాలకు అందని విధంగా ఏర్పడే మ్యానియా చాలమందిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఇప్పుడు రానా లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ విషయంలో అదే జరిగింది అని అంటున్నారు. ఈసినిమా ఫస్ట్ లుక్ ఆ తరువాత వచ్చిన ట్రైలర్ వల్ల ఏర్పడిన క్రేజ్ ఈసినిమా నిర్మించిన సురేష్ బాబుకే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అని టాక్.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమాను 20 కోట్ల బడ్జెట్ తో పూర్తి చేసారు. అయితే రానాకు ‘బాహుబలి 2’ తో వచ్చిన నేషనల్ క్రేజ్ తో ఈసినిమా తెలుగు తమిళ హిందీ శాటిలైట్ రైట్స్ ను ఒక ప్రముఖ ఛానల్ 16 కోట్లకు కొనుక్కుంది అన్న ప్రచారం జరుగుతోంది. 

అంతేకాదు అమెజాన్ సంస్థ ఈసినిమా డిజిటల్ రైట్స్ ను 4 కోట్లకు కొనుక్కుంది అన్న ప్రచారం కూడ జరుగుతోంది. దీనితో ఈ సినిమా పై పెట్టిన 20 కోట్ల పెట్టుబడి తిరిగి వచ్చే పరిస్థుతులు ఏర్పడటంతో ఈ సినిమాను మన తెలుగు రాష్ట్రాలలోని బయ్యర్లకు అమ్మాలా వద్దా అన్న ఆలోచనలలో నిర్మాత సురేష్ బాబు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు సినిమాను నిర్మిస్తున్న బ్లూ ప్లానెట్ కు స్వంత డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ఉండడంతో పాటు సురేష్ మూవీస్ సురేష్ బాబు పార్టనర్ కావడం ఆయనకు పంపిణీ వ్యవస్థ ఉండడం వల్ల ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాకు అన్ని విషయాలు కలిసి వచ్చే విషయాలుగా మారాయి అనిఅంటూన్నారు. దీనికితోడు ఈ సినిమా కథ ప్రస్తుత రాజకీయాల పై సెటైర్ గా ఉంటుంది అన్న ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో ఇటువంటి జోనర్ సినిమాలు రానినేపధ్యంలో  ఈ పరిస్థితులు అన్నీ  రానాకు అదేవిధంగా తేజాకు  కలిసివచ్చే అంశాలుగా మారాయి అన్న ప్రచారం జరుగుతోంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: