bahubali 2 latest  trailer views కోసం చిత్ర ఫలితం


సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని చిత్రరాజం బాహుబలి. బాహుబలి 2 ది కంక్లూజన్ తెలుగు సినిమా ప్రతిష్ఠని ప్రపంచ వ్యాప్తం చేసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. రిలీజ్‌కు ముందే రికార్డుల వేట మొదలు పెట్టిన ఈ చిత్రం విడుదల తర్వాత రికార్డుల మీద రికార్డులు బద్దలు గొడుతూ విమర్శకుల ప్రశంసలు సైతం అందు కుంది. దేశంలోనే అత్యధిక స్క్రీన్లపై విడుదలైన సినిమాగా, అతి తక్కువ రోజుల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించిన బాహుబలి 2 ది కంక్లూజన్ ను మాస్కో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌లో తొలి చిత్రంగా ప్రదర్శించడం ఆ సినిమాకున్న గొప్పదనాన్ని తెలియజేస్తోంది.


7 crore views achived by bahubali 2 కోసం చిత్ర ఫలితం

 
తాజాగా బాహుబలి 2 చిత్రం తన ఖాతాలో మరో రికార్డును వేసుకుంది. ఈ సినిమా హిందీ ట్రైలర్‌ను ఇప్పటి వరకు 7 కోట్ల మంది వీక్షించారు. తద్వారా 7 కోట్ల వ్యూస్ దాటిన తొలి ట్రైలర్‌ గానూ చరిత్ర సృష్టించింది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఓ ప్రాంతీయ చిత్రానికి ఇంతటి ఘనత దక్కడం ఇదే తొలిసారి. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విటర్‌ ద్వారా తెలుపుతూ.. "ఇండియన్‌ బాక్సాఫీస్‌" ట్వీట్‌ను రీట్వీట్‌ చేసింది. "జై మాహిష్మతి" అని ట్వీట్‌ చేసింది. ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ ఘనత దక్కడం విశేషం.


"బాహుబలి:ది బిగినింగ్‌" కి కొనసాగింపుగా ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి "బాహుబలి: ది కన్‌క్లూజన్‌" తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్‌, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు.


7 crore views achived by bahubali 2 కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: