సినిమా ప్రపంచం అంటేనే సెంటిమెంట్ లతో ముడిపడి ఉంటుంది. కోట్లాది రూపాయల ఖర్చుతో సినిమాలు తీస్తూ ఉంటారు కాబట్టి సెంటిమెంట్ కు సంబంధించి ఏ ఒక్క చిన్న విషయం బయటకు వచ్చినా ఆ సినిమా నిర్మించిన దర్శకనిర్మాతలతో పాటు ఆ సినిమా హీరో వీరాభిమానులు కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. ఇక లేటెస్ట్ గా పవన్ అత్తారింటికి దారేది సినిమా కు సంబంధించి ఒక సెంటిమెంట్ కు సంబంధించిన రూమర్ ఫిలిం నగర్ లో హడావుడి చేస్తోంది. అదేమిటి అనుకుంటున్నారా..?

పవన్ కళ్యాణ్ తో సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకులు అందరికీ ‘సెకండ్ ఫిల్మ్’ సెంటిమెంట్ గండం ఉందట. గతంలో పవన్ తో సినిమాలు చేసిన బీమినేని శ్రీనివాసరావు, పూరి జగన్నాధ్, కరుణాకర్, ఎస్ జే.సూర్య లు పవన్ తో తాము చేసిన మొట్టమొదటి సినిమాలు సూపర్ హిట్ అయినా, వారు చేసిన రెండవ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర పల్టీలు కొట్టాయి. దీనికి ఉదాహరణ గా అన్నవరం, కెమెరామెన్ గంగతో రాంబాబు, బాలు, పులి సినిమాలను చెపుతున్నారు. ఇప్పుడు అదే కోవలో జల్సా వంటి సూపర్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం పవన్ తో తీస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాను ఈ సెంటిమెంట్ గండం నుంచి గట్టేకించి కాపాడగలుగుతాడా..? అని పవన్ అభిమానులు భయపడడమే కాకుండా కనబడ్డ ప్రతి దైవానికి ఈ సెంటిమెంట్ గండం నుండి పవన్ అత్తారింటికి దారేది గట్టెక్కాలని మొక్కుకుంటున్నారట.

గతంలో జరిగిన విషయాలను రిపీట్ చేస్తూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సెంటిమెంట్ గండానికి బలి అవుతాడా..? లేకుంటే తన అమోఘమైన పంచ్ డైలాగ్స్ మాయతో ఈ సెంటిమెంట్ కు ఎదురీది మరో సరికొత్త రికార్డు ను పవన్ అభిమానులకు అందిస్తాడా..? అనే విషయం వచ్చే నెల 7 వ తారీఖున తేలిపోతుంది. అప్పటి వరకూ పవన్ అభిమానులకు ఈ టెన్షన్ తప్పదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: