తమ అభిమాన హీరో సినిమా విడుదలకు రెడీ అవుతోంది అంటే అభిమానులకు పండగే. కాని ఇక్కడ సీన్ రివర్స్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘వన్’ నేనొక్కడినే సినిమా  ఈ సంవత్సరం డిసెంబర్ లో వస్తుందని ఆ మధ్య వార్తలు వచ్చినా, ప్రస్తుతం మాత్రం ఈ సినిమా నిర్మాతలు మహేష్ సినిమాను సంక్రాంతి బరిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారనే వార్త మహేష్ అభిమానులకు నిద్రలేకుండా చేస్తోందట. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుకుమార్ అంటున్నారు.

ఇక వివరాలలోకి వెళ్ళితే, ఈ సినిమాలో మహేష్ బాబు చేస్తున్నది నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర అనే టాక్ చాలా గట్టిగా వినిపిస్తోంది. క్రియేటివిటీ లెవెల్ ఎక్కువగా ఉండే సుకుమార్, మహేష్ విషయంలో ఈ నెగటివ్ షేడ్ ను మరీ ఎక్కువగా చూపెడితే మహేష్ అభిమానులు తట్టుకోలేరని భయపడుతున్నారట. గతంలో ఆర్య సినిమాలో బన్నీ పాత్రను రకరకాల మలుపులు తిప్పి వెరైటీ గా చూపించిన సుకుమార్, ఆర్య-2 దగ్గరకు వచ్చే సరికి అదే బన్నీ ని పూర్తి నెగటివ్ క్యారెక్టర్ గా మార్చి, బన్నీ అభిమానులకు కూడా షాక్ ఇచ్చాడు. దానితో ఆ సినిమా పరాయజం పొందింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ ‘ఖలేజా’ సినిమాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ ను ‘దేవుడు’ పాత్రలో కొత్తప్రయోగం చేస్తే, అది మహేష్ బాబు కు పరాయజాన్ని తెచ్చిపెట్టింది. ఈ విషయాలు అన్నీ గుర్తుచేసుకుంటూ ప్రస్తుతం మహేష్ బాబు అభిమానులు సుకుమార్ సినిమాలో మన టాలీవుడ్ ప్రిన్స్ నెగటివ్ రేంజ్ ఏ స్థాయి లో ఉంటుందో అంటూ ఖంగారు పడుతున్నారట.

మహేష్ బాబు ఇప్పటి వరకూ నటించిన ఏ సినిమాలోనూ నెగటివ్ పాత్రలో కనిపించకపోవడంతో, ఈ కొత్త ప్రయోగం వికటిస్తే పరిస్థితి ఏమిటి..? అంటూ అప్పుడే చర్చలు కూడా జరుపుతున్నారట మహేష్ అభిమానులు. ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రిన్స్ మహేష్ క్రేజ్ విపరీతంగా ఉండడం, దానికి తోడు అమ్మాయిలలో కూడా మహేష్ పట్ల పెద్ద ఫాలోయింగ్ ఏర్పడడంతో, క్యారెక్టర్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా, అది దిద్దుకోలేని తప్పటడుగుగా మారిపోతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహేష్ అభిమానులు మహేష్ బాబు కు మెసేజ్ లు పెడుతున్నారట. వెరైటీ పాత్రలను ఇష్టపడే మన టాలీవుడ్ ప్రిన్స్, తను ప్రస్తుతం నటిస్తున్న వన్ సినిమాలోని పాత్ర విషయంలో ఏమైనా మార్పులు చేస్తాడా..? లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: