తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ కి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.   సాధారణంగా పబ్లిసిటికి దూరంగా ఉండే రజినీకాంత్ త‌న రెగ్యుల‌ర్ హెల్త్ చెక‌ప్ కోసం యూఎస్ వెళ్ళారు. ఇటీవ‌ల 2.0 చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సూప‌ర్ స్టార్ ప్ర‌స్తుతం కాలా చిత్రంతో బిజీగా ఉన్నాడు.  ఆ మద్య రోబో 2.0 చిత్రం షూటింగ్ సమయంలో కూడా తన కూతురు ఐశ్వర్య తో కలిసి యూఎస్ వెళ్లారు రజినీకాంత్.  
Image result for 2.0
ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజ‌కీయాల‌తో వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం అమెరికాలో ఉన్న రజనీ... తాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాననే విషయాన్ని సెల్ఫీ వీడియా ద్వారా అభిమానులకు తెలియజేశారు. ఖరీదైన ఫెర్రారీ ఓపెన్ కారులో దూసుకుపోతూ రజనీ దిగిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

మ‌రో వైపు ర‌జ‌నీకాంత్ పార్టీ ప్ర‌క‌ట‌న ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తి ఎదురు చూస్తుండ‌గా, పార్టీ ప్ర‌క‌ట‌న డిసెంబ‌ర్ 12( ర‌జ‌నీకాంత్ బ‌ర్త్ డే) న ఉంటుంద‌ని కోలీవుడ్ మీడియా చెబుతుంది.   కాస్త స్మైల్ ఇస్తూ ఫ్యాన్స్ కి హాయ్ చెబుతున్న ఈ వీడియో 34 సెక‌న్స్ మాత్ర‌మే ఉంది. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.   జీఎస్టీ నుంచి సినిమా థియేటర్లను మినహాయించాలని తమిళనాడులో ధర్నా జరుగుతోంది. వీరందరికీ అమెరికా నుంచే రజనీ తన మద్దతును తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: