క్రియేటీవ్ దర్శకుడు రాజమౌళి తన సినిమాల విషయంలో ఎక్కడా రాజీ అన్న ప్రశక్తే లేదు. సినిమా నిర్మాణంలోని ప్రతి విభాగంలోనూ తన దృష్టి పెట్టడమే కాకుండా లైట్ బాయ్ నుండి ప్రతి ఒక్కరు తన మైండ్ సెట్ కు అనుగుణంగా నడిచేడట్లు గా మార్చుకుంటాడు మన తెలుగు జక్కన్న. ఎందరికో అభిమాన దర్శకుడైన మన రాజమౌళీకి కూడా ఇష్టమైన సేలిబ్రేటీలు కొందరున్నారు.

వారి గురించి ఈ మధ్య రాజమౌళి తన ఇంటర్వ్యూలలో తెలియచేసాడు. రాజమౌళి మనసు దోచుకున్న సెలబ్రేటీలు ఎవరంటే నటనకూ డైలాగ్ డెలవరీకి నందమూరి తారకరామారావును అభిమానిస్తే, డాన్సుల్లో మెగాస్టార్ చిరంజీవిని, ముఖ కవళికల ద్వారా భావాలను పలికించడంలో మహానటి సావిత్రిని, డైలాగ్ మాడ్యులేషన్ లో ఎస్.వి. రంగారావును అభినిస్తానని రాజమౌళి చెపుతున్నారు. ఇంతకీ రాజమౌళి అభిమానించే దర్శకుడు ఎవరో చెప్పక పోవడం సస్పెన్స్... .

మరింత సమాచారం తెలుసుకోండి: