తెలుగు ఇండస్ట్రీలో వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్ జంటగా నటించిన ‘నిన్ను కోరి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా పై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి.  అంతే కాదు నివేదా థామస్ తో నానికి ఇది రెండవ చిత్రం.  జంటిల్ మాన్ లో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే..ఆ సినిమా మంచి విజయం సాధించింది.
Image result for samantha
నిన్న రిలీజ్ అయిన నిన్ను కోరి చిత్రం కొన్ని చోట్ల పాజిటీవ్ స్పందన వస్తే..కొన్ని చోట్ల మాత్రం రొటీస్ స్టోరీ అని కొట్టి పడేశారు. ఇప్పుడు నానికి ఉన్న క్రేజ్ కి అతనితో నటించడానికి ఏ హీరోయిన్ అయినా ఉత్సాహం చూపిస్తున్నారు.  కానీ ఓ హీరోయిన్ మాత్రం నిన్ను కోరి చిత్రంలో చాన్స్ వస్తే రిజక్ట్ చేసిందట.  ఇంతకీ ఆ టాప్ హీరోయిన్ ఎవరా అనుకుంటున్నారా..ఒకప్పుడు నానితో రెండు సినిమాల్లో నటించి..‘ఈగ’ తో సూపర్ హిట్ అందుకున్న అందాల ముద్దుగుమ్మ సమంత.   నివేదా థామస్ కు బదులుగా మొదట ఈ పాత్రకు హీరోయిన్ సమంత ని అడిగారట .
Image result for ninnu kori still
కథ మొత్తం విన్నాక ఎందుకో సమంత చేయనని తేల్చి చెప్పేసిందట . అయితే సమంత ఈ సినిమా చేయక పోవడానికి కోన వెంకట్ కారణమని అనుకుంటున్నారు . నాని సలహా మేరకు సమంత కు బదులుగా నివేదా థామస్ ని ఎంచుకున్నారు . కట్ చేస్తే నివేదా థామస్ నటనకు తెలుగు ప్రేక్షకులు మంచి మార్కులు ఇచ్చారు.  ఈ చిత్రంలో నానితో పాటు ఆది పినిశెట్టి కూడా నటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: