మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. పల్లెటూరి ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాలో చరణ్ కొత్త గెటప్ లో కనిపిస్తున్నాడని తెలిసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు సంబందించిన విషయాలతో సమంత మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది.


రంగస్థలం సినిమాతో మొదటిసారి చెర్రితో జత కడుతున్న సమంత సినిమాలో రాం చరణ్ ఎంతో కష్టపడి చేస్తున్నాడని అంటుంది. అంతేకాదు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో రాం చరణ్ తన బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడని అంటుంది సమంత. ఈ సినిమాలో చరణ్ తన పర్ఫార్మెన్స్ తో అందరిని సర్ ప్రైజ్ చేస్తాడంటూ ఊరిస్తుంది సమంత. 


సినిమాలో అభిమన్యు నారాయణ పాత్రలో చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. ఈ సినిమా కథ ప్రకారంగానే రంగస్థలం టైటిల్ పెట్టారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2018 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లో తప్పకుండా కొత్త ఉత్సాహం నింపుతుందని ఫిల్మ్ నగర్ టాక్.

మరి అందరు ఆశిస్తున్నట్టుగా రంగస్థలం సినిమా ఉంటుందా లేదా అన్నది చూడాలి. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: