Image result for darling prabhas about baahubali 1



భారత చిత్రపరిశ్రమకు నూతన మార్గ నిర్దేశనం చేసి, తెలుగు సినిమా చరిత్రలో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన  "బాహుబలి:  ద బిగినింగ్‌"  సినిమా విడుదలై రెండేళ్లు పూర్తయింది. 2015, జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకులకు ముందుకు రాజసంతో వచ్చి అఖండ విజయాన్ని సాధించింది. ఈ సినిమా ప్రేక్షకుల మన్నన పొందడంతో పాటు భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం విజయంతో రెండో భాగంపై చిత్ర యూనిట్‌ మరింత విశ్వాసంతో పనిచేసింది. ఇక "బాహుబలి: ద కన్‌క్లూజన్‌" సినిమా రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.


"బాహుబలి: ద బిగినింగ్‌"  విడుదలై రెండేళ్లు పూర్తైన సందర్భంగా హీరో ప్రభాస్‌ తన సంతోషాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైందని పేర్కొన్నాడు. ఈ చిత్రం కోసం పనిచేసిన రోజులను గుర్తు చేసుకున్నాడు. చిత్ర యూనిట్‌ అంతా ఎంతో ఇష్టంగా పనిచేసిందని తెలిపాడు. ఇలాంటి గొప్ప అవకాశం రావడానికి కారణమైన తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. బాహుబలి చిత్రానికి పనిచేసిన వారందరినీ అభినందించాడు. తమను వెనకుండి నడిపించిన దర్శక ధీరుడు రాజమౌళికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. 


Image result for darling prabhas about baahubali 1


ఇప్పుడు ప్రభాస్‌ ప్రస్తుతం మరో భారీ బడ్జెత్ సినిమా "సాహో" లో నటిస్తున్నాడు. ఒక ప్రయత్న విజయం మరెన్నో సుదూర విజయాలకు అంకురార్పణ చేస్తుందన్న దానికి ఇంకే ఋజువూ అవసరం లేదు. బాహుబలి ది బిగినింగ్ ఆరంభం మాత్రమే అని చెప్పొచ్చు. 



మరింత సమాచారం తెలుసుకోండి: