తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో అగ్రహీరోల సరసన నటించి నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిపోయింది శ్రీదేవి.  అప్పట్లో తెలుగులో శ్రీదేవి సినిమాలంటే మినిమం గ్యారెంటీ హిట్ సినిమాలుగా నిలిచేవి.  నాటి తరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి మొన్నటి నాగార్జున, వెంకటేష్ లకు కూడా హీరోయిన్ గా నటించింది.  తెలుగులో అతిలోక సుందరిగా వెలిగిపోయిన శ్రీదేవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.  బోనీకపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి తర్వాత చాలా కాలం వరకు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
Image result for sridevi crying
ఇక ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఆ మద్య తమిళంలో విజయ్ నటించిన ‘పులి’ చిత్రంలో నటించింది.  తాజాగా ‘మామ్’ చిత్రంతో అభిమానుల ముందుకు వచ్చింది.  ఓ ప్రమోషన్ లో భాగంగా శ్రీదేవి కన్నీరు పెట్టుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  చాలా కాలం తర్వాత ‘మామ్’ తెలుగు వర్షన్ లో కనిపించిన శ్రీదేవి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూ ఇస్తూ, మధ్యలో తనతో పాటు నటించిన అమ్మాయిని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంది.  
Image result for sridevi crying
ఇండస్ట్రీలో శ్రీదేవి బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ‘పదహారేళ్ళ వయసు ’ చిత్రంతో హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె కెరీర్ లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది..శ్రీదేవి అందంతో పాటు అభినయం కూడా అద్భుతం అని విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.   ఒక సినిమా తీసే క్రమంలో ఆ నటులతో చక్కటి అనుబంధాన్ని పెంచుకునే మనస్థత్వం ఉన్న శ్రీదేవి..తన కూతురుగా నటించిన సాజల్ ని గుర్తుకు చేసుకొని ఒక్కసారే కన్నీరు పెట్టింది.  
Image result for mom movie
ఈ చిత్రంలో సాజల్ నిజంగా తన ఇద్దరు కూతుళ్ల వలే కనిపించిందని.. ఈ ఇద్దరికీ నిజమైన తల్లీకూతుళ్లకు ఉన్నంత బంధం ఏర్పడిపోయిందట. షూటింగ్ అయిపోగానే సాజల్ ను తలుచుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్న శ్రీదేవి, ప్రమోషన్స్ టైమ్ లో సాజల్ గుర్తు రావడంతో ఏడ్చేసింది. సాజల్ పాకిస్థాన్ నటి కావడంతో, ప్రమోషన్స్ కు రాలేకపోయింది.
Image result for mom movie
ఈ విషయాన్నే గుర్తు పెట్టుకుని ” నేనెందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నానో నాకే తెలియట్లేదు. సాజల్, ఐ మిస్ యు. సినిమా ఇంత సక్సెస్ అయి విజయాన్ని సాధించిన సమయంలో, నువ్వు దగ్గర లేకపోవడం నాకు చాలా బాధను కలిగిస్తోందీ అంటూ ఏమోషనల్ గా ఏడ్చేశారు. మొదటి నుంచి శ్రీదేవి ది చాలా సున్నితమైన మనస్థత్వం..తనకు జాన్వి, ఖుషీలు ఎంతో సాజల్ కూడా అంతేనన్న శ్రీదేవి తల్లి మనసుకు చూసి చలించిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: