టాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరూ ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబ కలహాల కారణంగానే ఆమె అలాంటి నిర్ణయం తీసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. చికిత్స పొందుతున్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో వితిక తన ట్విట్టర్ ద్వారా రూమర్స్ కి బ్రేక్ వేసింది. త‌మ‌పై వస్తున్న న్యూస్ అన్ని ఫేక్ అని, తాము సంతోషంగా ఉన్నాం. పుకార్లను నమ్మొద్దంటూ వితిక ట్వీట్ చేసింది.


హ్యాపీ డేస్ మూవీతో ఒక్కసారిగా స్టార్డమ్ పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్..కొత్త బంగారు లోకం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర‌య్యాడు. ప్రేమ ఇష్క్ కాదల్ ఫేం వితిక శేరుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్7, 2015లో వీరిద్దరి నిశ్చితార్ధ వేడుక జరగగా ఆగస్ట్ 8,2016 న ఆలంకృత రిసార్ట్స్ లో వరుణ్, వితికల పెళ్ళి గ్రాండ్‌గా జరిగింది.  అయితే పెళ్ళి తర్వాత కొద్ది రోజులు అమెరికాలో ఉండొచ్చిన దంపతులు.. ప్రస్తుతం హైదరాబాద్లో నివసిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: