లీడర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన బెంగాళీ రసగుల్ల రిచా గంగోపాధ్యాయ కు మిర్చి సినిమా విడుదల అయ్యేదాకా ఆమెను ఐరన్ లెగ్ హీరోయిన్ గానే చూశారు. కాని అనుకోకుండా రిచా సుడి తిరిగి మిర్చి సూపర్ హిట్ అవడంతో ఐరన్ లెగ్ కాస్తా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. ఇంతవరకూబాగానే ఉంది కాని ఆమెకు వచ్చిన ఎ అదృష్టాన్ని తన కెరియర్ కు ప్లస్ పాయింట్ గా మార్చుకోవడంలో కొద్దిగా వెనక పడిందనే అంటున్నారు విశ్లేషకులు.

ప్రస్తుతం రిచా నాగార్జున తో ‘భాయ్’ సినిమాలో నటిస్తున్నా, ఈ సినిమా కాకుండా మరే యంగ్ హీరోల సినిమాలలోనూ రిచా నటించడం లేదు. దీనికి సంబంధించి ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రిచా తన వివరణ ఇచ్చింది. తనకు మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని కోరిక అని, కాని తనదగ్గరకు వస్తున్న నిర్మాతలు అంతా స్కిన్ ఎక్ష్-పోజింగ్ చేసే గ్లామరస్ పాత్రలను ఆఫర్ చేస్తున్నారని, అంతేకాదు ఎక్కువ పారితోషికం ఇస్తాను బికినీ వేసుకుంటావా...? అని అడుగుతున్నారని, తనకే ఇటువంటి పాత్రలు ఎందుకు నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారో అర్ధం కావడం లేదని, అందువల్ల అటువంటి పాత్రలను ఒప్పుకోలేక పోతున్నానని, ఆ పాత్రలన్నీ చేసి ఉంటె తాను కూడా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయిఉండేదానిని అని తన బాధ అంతా చెప్పుకొచ్చింది రిచా ఆ ఇంటర్వ్యూ లో.

రిచా చెపుతున్న మాటలన్నీ బాగున్నాయి కాని ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలుతున్న యంగ్ హీరోస్ రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఅర్, మహేష్ లు రిచా పక్కన నటించకపోవడానికి ప్రధాన కారణం ఆమె ఈ హీరోలు ఎవరితోనూ మేడ్ ఫర్ ఈచ్ అధర్ గా ఉండదని ప్రస్తుత టాప్ యంగ్ హీరోల అభిప్రాయం అట. మరి మన టాప్ హీరోల అలా ఆలోచిస్తూ ఉంటె, మరో వైపు రిచా ఏమో బికినీలు వేసుకొను అంటోంది. మరి అటువంటి పరిస్థితులలో రిచా కు ఆఫర్స్ రావుకదా. అందుకనే మిర్చి సూపర్ హిట్ అయినా రిచా ఆ సినిమా విజయాన్ని ఉపయోగించుకోలేక పొయింది. పోనీ మన వెండితెర మన్మధుడు నాగార్జున అయినా ఆమెకు మంచి టర్నింగ్ పాయింట్ ఇస్తాడేమో చూడాలి.ఏది ఏమైనా తన తోటి సహా నాయికలు అయిన తమన్నా, అనుష్క ల దగ్గర రిచా కొద్దిగా కోచింగ్ క్లాస్ లు తీసుకుంటే నిర్మాతలకు రిచా తో ఈ పాట్లు ఉండవు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: