బాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ షో ఇప్పుడు టాలీవుడ్ లో రాబోతుంది.  ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ‘బిగ్ బాస్’ షో కి సంబంధించిన ఫ్టస్ లుక్, ప్రొమోలతో సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు.  ఈ మద్య బుల్లి తెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ కి అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు.  తెలుగు బుల్లితెరపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా ‘బిగ్ బాస్’ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.  

            చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్..!
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ఈ ప్రోగ్రామ్ వెంటనే ఆపేయాలని ‘బిగ్ బాస్’ షో వల్ల కొంత మంది మనోభావాలు దెబ్బతింటాయని ఇప్పటికే తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్ ’పై పలు విమర్శలు వస్తున్నాయి. త‌మిళ సంస్కృతికి, త‌మిళ నాడు విలువ‌ల‌కి వ్య‌తిరేఖంగా వెళుతున్నాడ‌ని హిందూ మక్కల్ కట్చి ఆరోపిస్తుంది.  
Image result for salman khan bigg boss
ఈ మేరకు షో నిర్వాహకులు, కమల్‌హాసన్‌‌లపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. బిగ్ బాస్ షో ద్వారా ఎక్కువ‌గా బూతు చూపిస్తున్నార‌ని, వెంట‌నే ఈ కార్యక్ర‌మాన్ని ఆప‌క‌పోతే భౌతిక దౌడులు చేసేందుకు కూడా వెనుకాడ‌బోమ‌ని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తెలుగు లో వస్తన్న బిగ్ బాస్ షో తెలుగు సాంప్రదాయాలను మంటకలపడం ఖాయమని , ఒక పెద్ద హీరో అయి ఉండి ఇలాంటి షోకి హోస్ట్ గా ఎలా వ్యవహరిస్తున్నాడు ఎన్టీఆర్ అంటూ అతడి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు ఆర్కే గౌడ్ .  

            చిక్కుల్లో పడ్డ కమల్ హాసన్..!
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అయిన ఆర్కే గౌడ్ స్పందిస్తూ వెంటనే ఈ షోని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈనెల 16న ఎన్టీఆర్ బిగ్ బాస్ షో ప్రారంభం  అవుతున్న విషయం తెలిసిందే. అయితే తమిళంలో కమల్ నిర్వహిస్తున్న ఈ షో ప్రారంభం అయ్యింది అయితే అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యింది మరి తెలుగులో హిట్ అవుతుందా లేదా చూడాలి . 


మరింత సమాచారం తెలుసుకోండి: