సౌత్ బ్యూటీ సమంత పెళ్లి దగ్గర పడుతున్నా కొద్ది మరింత బోల్డ్ గా తయారవుతుంది. నాగ చైతన్యతో అక్టోబర్ 6న పెళ్లి జరుపుకోనున్న సమంత ఈలోపే తను కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులన్నిటిని ఫినిష్ చేస్తుంది. ఇక ఈమధ్యనే జె.ఎఫ్.డబల్యు మేగజైన్ కోసం హాట్ స్టిల్స్ తో అదరగొట్టిన సమంత అదే రేంజ్ లో వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.


తనకిష్టమైన ఐదు ఎప్పుడూ తన వెంటే హ్యాండ్ బ్యాగ్ లో ఉంటాయని చెప్పిన సమంత ఓ అభిమాని ఫుడ్ ఆర్ సెక్స్ అన్న ప్రశ్నకు సమాధానం అందరు ఆశ్చర్యపడేలా ఇచ్చింది. ఓ రోజు తినకుండైనా ఉండొచ్చు కాని ఆ ఆకలి మాత్రం రోజు తీర్చుకోవాల్సిందే అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. 


పెళ్లి ఫిక్స్ అయ్యాక సమంతలో చాలా మార్పులొచ్చాయి. ఇదవరకే కాస్త పద్ధతిగా కనిపించిన అమ్మడు ఇప్పుడు మరింత రెచ్చిపోతుంది. ఎలాంటి విషయాన్నైనా సరే బోల్డ్ గా ట్రీట్ చేస్తున్న సమంత ఈమధ్య అందరికి షాకులు మీద షాక్ ఇస్తుంది. ఇక పెళ్లి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమాలు మాత్రం తప్పక చేస్తా అంటుంది సమంత. అంతేకాదు నచ్చిన అంశాల గురించే కాదు చైతులో నచ్చని అంశం ఒక్కటి లేదని చెప్పింది సమంత.


సినిమాలు ఓకే కాని పెళ్లి తర్వాత ఇలాంటి హాట్ ఫోటో షూట్స్ అంటే మాత్రం కష్టమే అంటున్నారు అక్కినేని అభిమానులు. కొద్దికాలంగా చైతన్యతో ప్రేమాయణం సాగించిన సమంత పెద్దల అంగీకారంతో పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ ఇయర్ మొదట్లో నెగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట అక్టోబర్ లో ఒకటి అవబోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: