ఆ మద్య సినిమా ఇండస్ట్రీని ఒక్క కుదుపు కుదిపేసింది మళియాళ నటి భావనపై అత్యాచార ఉదంతం.  ఆమె సొంత డ్రైవర్ మరో ఎక్స్ డ్రైవర్ తో కలిసి కిడ్నాప్ చేసి రెండు గంటల పాటు లైంగిక దాడి చేసి అశ్లీల ఫోటోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఈ మేరకు భావన నేరస్థులకు శిక్ష పడే వారకు పోరాడింది..ఎట్టకేలకు నింధితులను పోలీసులు అరెస్టు చేశారు.  కట్ చేస్తే..భావన పై లైంగిక దాడి విషయంలో కొత్త ట్విస్ట్ రావడం ఇప్పుడు మాలీవుడ్ లోనే కాదు అన్ని సినిమా ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారింది.  
Image result for మళియాళ నటి భావన
లైంగిక దాడికి గురైన మలయాళ నటి భావన.. ఈ కేసులో హీరో దిలీప్‌ అరెస్టు నేపథ్యంలో మౌనాన్ని వీడి స్పందించింది. తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి అనుమానితులుగా తాను ఎవరి పేరునూ పేర్కొనలేదని.. దిలీప్‌ అరెస్టుతో అందరిలాగానే తానూ షాక్‌కు గురయ్యానని ఆమె ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
Image result for మళియాళ నటి భావన
మలయాళ స్టార్ హీరో దిలీప్ అమాయకుడు , నేను అతడిపై ఫిర్యాదు చేయలేదు అంటూ ప్లేటు ఫిరాయించింది మలయాళ హీరోయిన్ భావన .  తనపై కుట్ర జరిగిందని ఆ కుట్రలో ప్రధాన సూత్రదారి దిలీప్ అని పోలీసులు అతడిని అరెస్టు చేసిన విషయం తెలిసి నిజంగా ఇప్పటికీ నమ్మలేక పోతున్నానని అంటుంది.
Image result for మళియాళ నటి భావన
అంతే కాదు ఆయనతో నెలకొన్న రియల్‌ ఎస్టేట్‌ తగాదాలు, ఆర్థిక వ్యవహారాల కారణంగా తమ మధ్య శత్రుత్వం నెలకొందంటూ వచ్చిన వార్తలను భావనఖండించింది. అలాంటిదేమీ లేదని.. కొన్ని వ్యక్తిగత సమస్యల వల్లనే తమ మధ్య స్నేహబంధం ముగిసిపోయిందని వివరించింది. దిలీప్‌ పేర్కొంటున్నట్టుగా అతడు ఈ నేరం చేసి ఉండకపోతే నిజం తప్పక బయటికొస్తుందని వ్యాఖ్యానించింది.
Image result for మళియాళ నటి భావన దిలీప్ సినిమా
పోలీసులు రకరకాలుగా దర్యాప్తు చేసి ఆధారాలతో అరెస్ట్ చేస్తే ఈ హీరోయిన్ మాత్రం అతడు అమాయకుడు అని ఎలా స్టేట్మెంట్ ఇస్తుందని షాక్ అవుతున్నారు . దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన విషయాలు తెలుస్తుండగా భావన మాత్రం మరోలా ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చింది.  మరోవైపు.. ఈ కేసులో తన సోదరుడిని అన్యాయంగా ఇరికించారని, ఇదంతా పక్కా ప్రణాళికతోనే చేస్తున్నారని.. దిలీప్‌ సోదరుడు అనూప్‌ ఆరోపించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: